వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

J&K సీఎం కన్నుమూత: వారం రోజులు సంతాప దినాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రానికి 12వ ముఖ్యమంత్రిగా పీడీపీ అగ్రనేత ముఫ్తీ మహ్మద్ సయీద్ 2015 మార్చి 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. పీడీపీ వ్యవస్థాపకుడైన ముఫ్తీ మహ్మద్ సయీద్ కాశ్మీర్ సీఎంగా రెండోసారి ఆ పదవిని చేపట్టారు. అంతకముందు 2002లో పీడీపీ-కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి మూడేళ్లపాటు సీఎంగా బాధ్యతలను స్వీకరించారు.

Jammu and Kashmir CM Mufti Mohammad Sayeed dies at 79

ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు ట్విట్టర్‌ ద్వారా సంతాపం తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పశ్చిమ్‌ బంగాల్ సీఎం మమతా బెనర్జీ, జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో వారం రోజుల పాటు సంతాప దినాలు

జమ్మూ కాశ్మీర్‌ సీఎం ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ మృతికి నివాళిగా రాష్ట్రంలో వారంరోజుల పాటు సంతాపదినాలు ప్రకటించారు. ఆయా రోజుల్లో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర అధికార ప్రతినిధి తెలిపారు. సీఎం మృతికి నివాళిగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాష్ట్ర జెండాలను గురువారం అవనతం చేశారు.

ఆయన మృతికి సంతాపంగా గురువారం ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులకు సెలవు ప్రకటించారు. కాగా, ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ముఫ్తీ పార్దీవదేహానికి ప్రధాని నరేంద్ర మోడీ పుష్ప గుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.

ముఫ్తీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శ్రీనగర్ వెళ్లనున్నారు. ఓ కశ్మీర్ రాజకీయ వేత్త సీఎం హోదాలో ప్రాణాలు విడవడం ఇది రెండోసారి. 1982లోనూ అప్పటి కశ్మీర్ ముఖ్యమంత్రి షేక్ మొహమ్మద్ అబ్దుల్లా కూడా సీఎం హోదాలోనే కన్నుమూశారు.

English summary
Jammu and Kashmir Chief Minister Mufti Mohammed Sayeed, who was admitted to a hospital in Delhi two weeks ago, has died. He was 79. Jammu and Kashmir CM Mufti Mohammad Sayeed died at AIIMS on Thursday morning. He was admitted in AIIMS for past 14 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X