వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూకాశ్మీర్ మున్సిపల్ ఎన్నికలు: 63.83శాతం ఓటింగ్

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో బుధవారం జరిగిన మొదటి దఫా స్థానిక సంస్థల ఎన్నికలు కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే జరిగాయి. కాశ్మీర్లోని వివిధ పార్టీలు ఎన్నికలను బహిష్కరించిన దృష్ట్యా మొత్తమ్మీద చూస్తే పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది.

 Jammu and Kashmir municipal elections: 63.83% voter turnout recorded

కేవలం 8.3 శాతమే నమోదైంది. అయితే టెర్రరిస్టుల ఇలాకాగా పేరున్న కార్గిల్ లో 78 శాతం, లేహ్ లో 52 శాతం నమోదైంది. ఇక సాయంత్రం 4 గంటల సమయానికి బుడ్గామ్ లో 17 శాతం, అనంతనాగ్ లో 7.3 శాతం, బారాముల్లాలో 5.7 శాతం, బందిపొరా సెక్టార్లో అతితక్కువగా 3.3 శాతం నమోదైంది. కడపటి వార్తలు అందే సమయానికి పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. మొత్తం 4 విడతల్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి.

పోలింగ్ ముగిసే సమయానికి తమకు అందిన సమాచారాన్ని బట్టి జమ్మూ మున్సిపల్ కార్పొరేషన్ (జేఎంసీ)లో 63.83 శాతం నమోదైందని, అలాగే ఖౌర్ మున్సిపల్ కార్పొరేషన్లో 89 శాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు. పోలింగ్ సిబ్బంది వెల్లడించే వివరాలే తుది ఫలితాలని, అవి రావడానికి మరికొంత సమయం పడుతుందని ఎన్నికల అధికారులు చెప్పారు.

English summary
A voter turnout of 63.83% was reorded in the first of four-phase municipal elections in Jammu and Kashmir that began at 7 am on Monday amid tight security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X