వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్:పాకిస్తాన్ కుట్ర బట్టబయలు - పరోక్షయుద్ద సామాగ్రి పట్టివేత - భారీ ఖర్చుతో మనోళ్ల యాంటీ ప్లాన్

|
Google Oneindia TeluguNews

జమ్మూ కశ్మీర్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా, తద్వారా భారత్ లో అలజడిరేకెత్తించేలా దాయాది పాకిస్తాన్ పన్నిన కుట్రలను భారత్ బట్టబయలు చేసింది. వీలైన అన్ని మార్గాల్లో ధ్వంసరచన, కుట్రలకు పాల్పడుతోన్న పాకిస్తాన్.. డ్రోన్ల ద్వారా జమ్మూ కశ్మీర్ లోకి ఆయుధాలను జారవిడుస్తున్నది. అదే సమయంలో నార్కో టెర్రరిజాన్నికూడా ముమ్మరం చేసి, పీవీసీ పైపుల ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్నది. పాక్ ఉగ్ర, డ్రగ్స్ కార్యకలాపాలకు చెక్ పెట్టేలా భారత్ భారీ ప్రణాళికను సిద్ధం చేసింది.

కొడుకు భార్యతో రాసలీలలు - కుటుంబానికి మత్తుమందు - మామకోడలు జంప్ - సీసీటీవీలో..కొడుకు భార్యతో రాసలీలలు - కుటుంబానికి మత్తుమందు - మామకోడలు జంప్ - సీసీటీవీలో..

తాజాగా అక్నూర్ సెక్టార్ లో..

తాజాగా అక్నూర్ సెక్టార్ లో..

చానాళ్లుగా ఉగ్రవాదం రూపంలో భారత్ పై పరోక్ష యుద్ధం చేస్తోన్న పాకిస్తాన్ టెక్నాలజీని కూడా వాడుకుంటూ.. డ్రోన్ల ద్వారా జమ్మూ కశ్మీర్ లోకి ఆయుధాలను జారవిడుస్తున్నది. నిజానికి డ్రోన్ల ద్వారా బట్వాడా అయ్యే ఆయుధాలను కనిపెట్టడం సవాలుతో కూడుకున్న ప్రక్రియే అయినా, ఆర్మీ, జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆ పని చేయడంలో సఫలం అవుతూ వచ్చారు. గడిచిన రెండు నెలల్లో ఐదు చోట్ల డ్రోన్ల ద్వారా జారవిడిచిన ఆయుధాలను కనిపెట్టగలిగారు. తాజాగా సోమవారం.. ఎల్వోసీని ఆనుకుని ఉండే అక్నూర్ సెక్టార్ లోనూ అలాంటి ప్యాకేజీనే మనవాళ్లు స్వాధీనం చేసుకున్నారు.

సుమేధా మృతి ఘటనలో సంచలనం - నేరపూరిత హత్య - మంత్రి కేటీఆర్‌పై పాప తల్లిదండ్రుల ఫిర్యాదుసుమేధా మృతి ఘటనలో సంచలనం - నేరపూరిత హత్య - మంత్రి కేటీఆర్‌పై పాప తల్లిదండ్రుల ఫిర్యాదు

భారీ ప్యాకేజీ..

భారీ ప్యాకేజీ..

ఆర్మీ, జమ్మూకాశ్మీర్ పోలీసులు సయుక్తంగా చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ లో డ్రోన్ ద్వారా జారవిడిచిన భారీ ప్యాకేజీని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు మీడియాకు తెలిపారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ ప్యాకేజీలో రెండు ఏకే-47 రైఫిళ్లు, మూడు మ్యాగజీన్లు, 90 రౌండ్ల బుల్లెట్లు, ఓ పిస్టల్ ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు ఆ ప్యాకేజీ, అందులోని ఆయుధాల ఫొటోలను విడుదల చేశారు. వరుసగా డ్రోన్ ప్యాకేజీలు లభ్యమవుతుండటంతో గాలింపు, నిఘా పెంచామని అధికారులు చెప్పారు. రెండు రోజుల కిందట జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ డ్రోన్ల ద్వారా ఆయుధాలు తరలిస్తోన్న పాకిస్తాన్ ను అడ్డుకోడానికి అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నామనడం తెలిసిందే.

పీవీసీ పైపులతో డ్రగ్స్‌..

పీవీసీ పైపులతో డ్రగ్స్‌..

జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాక్ నార్కో ఉగ్రవాదులు సైతం కొత్త దారులు కనిపెట్టారని తెలుస్తోంది. కంచెకు సమీపంగా దట్టమైన తోటల్లో భూగర్భంలో బంకర్లు తవ్వి అందులో దాక్కుంటున్నారని, పీవీసీ పైపుల ద్వారా మాదకద్రవ్యాలను, డ్రోన్ల ద్వారా ఆయుధాలను భారత్ లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. దేశంలోకి తరలించబోయిన 62కిలోల హెరాయిన్‌, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని బీఎ్‌సఎఫ్‌ ఆదివారం ఉదయం కశ్మీర్‌లోని ఆర్‌ఎస్‌ పురా సెక్టార్‌లోని సరిహద్దు వద్ద స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నాటి అక్నూర్ ఘటనతో కలిపి గత రెండు నెలల్లో ఐదు సార్లు డ్రోన్ల ఆయుధాలు పట్టుపడ్డాయి.

Recommended Video

Shikhar Dhawan Meets Pakistani Hindu Refugees In Delhi || Oneindia Telugu
నిఘా కోసం భారత్ భారీ ఖర్చు..

నిఘా కోసం భారత్ భారీ ఖర్చు..

పాకిస్తాన్ సరిహద్దు వెంబడి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ కార్యకలాపాలు ముమ్మరం కావడంతో వాటిని నిరోధించేందుకు భారత్ సైతం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. సరిహద్దుల్లో నిఘాను మరింత పటిష్టం చేసే క్రమంలో... 436 సూక్ష్మ డ్రోన్ల వాడకానికి బీఎస్ఎఫ్ కు అనుమతులు లభించాయి. ఉగ్రవాదుల కదలికలను గుర్తించడంతోపాటు ఆయుధాలను మోసుకొచ్చే డ్రోన్లను కూల్చివేయడానికి ఉపయోగించే యాంటీ డ్రోన్ వ్యవస్థను కూడా బీఎస్ఎఫ్ ఏర్పాటు చేసుకోనుంది. చిన్న, సూక్ష్మ డ్రోన్ ధర రూ. 89 కోట్ల వరకుఉంటుందని సమాచారం.

English summary
Security forces on Tuesday recovered a cache of arms and ammunition dropped by a Pakistani drone across the Line of Control (LoC) in the Akhnoor sector of Jammu division in the union territory (UT) of Jammu & Kashmir (J&K). It was the fifth such incident since June 20 when a similar arms-laden drone was shot down by the Border Security Force (BSF) personnel at Rathua in Kathua district’s Hiranagar sector. Pakistan, which is desperate to fuel terrorism in the UT, has adopted the latest modus operandi of using drones to drop arms, ammunition, drugs and money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X