• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టార్గెట్ 2024... బీజేపీ మాస్టర్ ప్లాన్... రంగంలోకి 43 మంది కేంద్రమంత్రులు-15వేల కి.మీ యాత్ర

|

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ల గడువు ఉంది. సాధారణంగా ఎన్నికలకు ఏడాది ముందు నుంచి రాజకీయ పార్టీలు అందుకు సన్నద్దమవుతుంటాయి. కానీ బీజేపీ మాత్రం ఎన్నికలకు మూడేళ్ల ముందుగానే ప్రిపరేషన్ మొదలుపెడుతోంది. నూతన కేంద్రమంత్రులను ప్రజలకు పరిచయడం చేయడంతో పాటు పనిలో పనిగా పార్టీని,ప్రభుత్వాన్ని జనానికి మరింత చేరువ చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఈ మేరకు అగస్టు 16 నుంచి మూడు రోజుల పాటు జన ఆశీర్వాద్ యాత్రలను నిర్వహించనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నూతన కేంద్రమంత్రుల పరిచయ కార్యక్రమానికి విపక్షాలు అడ్డుపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులను నేరుగా జనంలోకే తీసుకెళ్లేందుకు బీజేపీ ప్లాన్ చేసింది.

  2024 Elections : Jan Ashirwad Yatra Explained | BJP Big Plan || Oneindia Telugu
  15వేల కి.మీ కవర్ అయ్యేలా...

  15వేల కి.మీ కవర్ అయ్యేలా...

  కొత్తగా కేంద్రమంత్రులుగా ఎంపికైన 43 మంది బీజేపీ ఎంపీలు ఈ జన ఆశీర్వాద్ యాత్ర చేపట్టనున్నారు. ఒక్కో కేంద్రమంత్రి 3-4లోక్‌సభ నియోజకవర్గాలు,4-5 జిల్లాలను కవర్ చేస్తూ వారు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గానికి చేరుకోవాల్సి ఉంటుంది.ఈ క్రమంలో మొత్తం 300-400కి.మీ మేర జన ఆశీర్వాద్ యాత్ర కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా దాదాపు 150 లోక్‌సభ నియోజకవర్గాలను కవర్ చేసేలా 15వేల కి.మీ మేర యాత్రను చేపట్టేలా బీజేపీ ఇందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్,మణిపూర్ రాష్ట్రాలతో పాటు మొత్తం 19 రాష్ట్రాలు ఈ యాత్రలో కవర్ కనున్నాయి.

  అన్ని వర్గాలతో మమేకమయ్యేలా...

  అన్ని వర్గాలతో మమేకమయ్యేలా...

  జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ బిహార్‌లోని గయాలో అడుగుపెట్టి అక్కడి నుంచి 3,4లోక్‌సభ నియోజకవర్గాలను కవర్ చేస్తూ తన నియోజకవర్గం అరాహ్‌లో అడుగుపెడుతారు. మిగతా కేంద్రమంత్రులు కూడా ఇదే తరహాలో యాత్రను చేపడుతారు. యాత్ర సాగే క్రమంలో కేంద్రమంత్రులు గ్రామాల్లో,పట్టణాల్లో బస చేస్తారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలతో వారి సాధక,బాధకాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సామాజిక కార్యకర్తలు,స్వామిజీలు,క్రీడాకారులు,సైన్యంలో అమరులైన జవాన్ల కుటుంబాలను,కార్యకర్తలను కలుస్తారు.

  ఎంపీలంతా అందుబాటులో ఉండాలని ఆదేశాలు...

  ఎంపీలంతా అందుబాటులో ఉండాలని ఆదేశాలు...

  జన ఆశీర్వాద్ యాత్ర సమయంలో బీజేపీ ఎంపీలంతా తమ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలని బీజేపీ ఇప్పటికే ఆదేశించింది. యాత్ర జరిగే అగస్టు 16 నుంచి 3 రోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉండాలని సూచించింది. కేంద్రమంత్రులు తమ నియోజకవర్గాల్లోకి అడుగుపెట్టినప్పుడు వారికి ఘనస్వాగతం పలకాలని సూచించింది. ఈ యాత్రలన్నీ సామాన్యులకు చేరువవడమే లక్ష్యంగా... ఘనంగా,ప్రజలను ఆకట్టుకునేలా,ప్రభావవంతంగా సాగాలని 19 రాష్ట్రాల బీజేపీ నాయకత్వానికి ఆదేశాలిచ్చింది. జన ఆశీర్వాద్ యాత్ర సాగే మార్గంలో ప్రభుత్వ పథకాలను హైలైట్ చేసేలా హోర్డింగ్స్,ఫ్లెక్సీలు,అలాగే ప్రధాని మోదీ భారీ కటౌట్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

  సోషల్ మీడియా క్యాంపెయిన్స్...

  సోషల్ మీడియా క్యాంపెయిన్స్...

  యాత్ర సాగే మార్గంలో పలుచోట్ల కేంద్రమంత్రులు ప్రసంగించేలా ప్లాన్ చేసుకోవాలని... ప్రసంగాలు స్థూలంగా,ప్రభావవంతంగా ఉండాలని బీజేపీ అధిష్ఠానం సూచించింది. కేంద్రమంత్రుల ప్రసంగాల్లో ప్రభుత్వ పథకాలు,అభివృద్ది పనులు,స్థానిక సమస్యలను తప్పక ప్రస్తావించాలని పేర్కొంది. పార్టీకి చెందిన కొత్త,పాత కేడర్ అంతా యాత్రలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అదే సమయంలో సోషల్ మీడియా భారీ క్యాంపెయిన్స్ నిర్వహించాలని... యాత్ర జరిగే లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రతీ ఒక్కరికీ చేరువయ్యేలా ప్లాన్ రూపొందించుకోవాలని సూచించింది.

  యాత్రల బాధ్యతలు ఎవరికి...

  యాత్రల బాధ్యతలు ఎవరికి...

  19 రాష్ట్రాల్లో జరిగే ఈ యాత్రల బాధ్యతలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.చౌబా,జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్,జాతీయ కార్యదర్శులు అరవింద్ మీనన్,వినోద్ సొన్కర్,సునీల్ దియోధర్,సత్యకుమార్,పంకజ ముండే తీసుకోనున్నారు. ఆయా రాష్ట్రాల అధ్యక్షులు యాత్రలను పర్యవేక్షిస్తారు. ఒక్కో యాత్రకు ఒక్కో ఇన్‌చార్జి,నలుగురు కోఇన్‌చార్జిలను,ఒక మీడియా ఇన్‌చార్జిని నియమించనున్నారు. ఢిల్లీ, యూపీ, బీహార్, రాజస్థాన్, త్రిపుర, జార్ఖండ్, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, ఒడిశా, మణిపూర్, మహారాష్ట్ర, అసోం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల్లో జన ఆశీర్వాద్ యాత్రలు జరగనున్నాయి. 2024 ఎన్నికల ప్రచారానికి బీజేపీ దీన్ని ఆరంభంగా భావిస్తోంది.

  English summary
  The 43 new cabinet ministers will held the Jana Ashirwad Yatra in their constitutencies. Each Union Minister will have to cover 3-4 Lok Sabha constituencies and 4-5 districts to reach the Lok Sabha constituency which they represent.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X