వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్రమ మైనింగ్ కేసు, మాజీ సీఎం సేఫ్, రిల్యాక్స్, రూ. 150 కోట్లు లంచం ? గాలి జనార్దన్ రెడ్డి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామిని చాల కాలంగా వెంటాడుతున్న జంతకల్ అక్రమ మైనింగ్ కేసులో ఆయన ఊపిరిపీల్చుకున్నారు. జంతకల్ అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ (ఎస్ఐటీ) అధికారులు కొత్తగా తయారు చేసిన చార్జ్ షీట్ లో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి పేరు చేర్చలేదు. జంతకల్ మైనింగ్ కంపెనీ నుంచి కుమారస్వామి రూ. 150 కోట్లు లంచం తీసుకున్నారని అప్పట్లో మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. చార్జ్ షీట్ లో పేరు లేకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి హమ్మయ్యా అంటూ రిలాక్స్ అయ్యారు.

బెంగళూరులో లైవ్ బ్యాండ్ అమ్మాయిలు, హైటెక్ వ్యభిచారం, రెచ్చిపో, విటులకు వల!బెంగళూరులో లైవ్ బ్యాండ్ అమ్మాయిలు, హైటెక్ వ్యభిచారం, రెచ్చిపో, విటులకు వల!

అక్రమ మైనింగ్ స్కాం

అక్రమ మైనింగ్ స్కాం

జంతకల్ అక్రమ మైనింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామికి సంబంధం ఉందని, ఆయనను విచారణ చెయ్యాలని దావణగెరె జిల్లా చెన్నగిరికి చెందిన ఆర్ టీఐ కార్యకర్త హరీష్ హళ్ళి కోర్టును ఆశ్రయించారు. మాజీ సీఎం కుమారస్వామితో పాటు న్యాయశాఖ కార్యదర్శి, లోకాయుక్త రిజిస్టార్ లను ప్రతివాదులుగా చేర్చారు.

కుమారస్వామికి తెలీదు !

కుమారస్వామికి తెలీదు !

మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి మీద ఐపీఎస్ 420, 465, 467, 468, 471, 120(బి) సెక్షన్ ల కింద కేసు నమోదు అయ్యింది. అయితే మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు లేవని ఎస్ఐటీ అధికారులు చార్జ్ షీట్ లో ఆయన పేరు తొలగించారు.

మాజీ సీఎం, ఆయన భార్య !

మాజీ సీఎం, ఆయన భార్య !

మాజీ సీఎం కుమారస్వామి, ఆయన భార్య అనితా కుమారస్వామికి జంతకల్ మైనింగ్ కంపెనీ వ్యవస్థాపకుడి మీద కేసు నమోదైయ్యింది. ఈ కేసు విచారణ రద్దు చెయ్యాలని మాజీ సీఎం కుమారస్వామి హై కోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారణ రద్దు చేసింది. ఇదే కేసులో మాజీ సీఎం కుమారస్వామితో పాటు అందరికీ జామీను వచ్చింది.

రూ. 150 కోట్లు లంచం, గాలి

రూ. 150 కోట్లు లంచం, గాలి

జంతకల్ మైనింగ్ కంపెనీ నుంచి హెచ్.డీ. కుమారస్వామి రూ. 150 కోట్లు లంచం తీసుకున్నారని 2007లో మైనింగ్ కింగ్ బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి ఆరోపణలతో దేశ వ్యాప్తంగా ఈ కేసు విషయం చర్చకు దారి తీసింది. తన ఆరోపణలకు పూర్తి సాక్షాలు ఇవ్వడానికి మూడు వారాలు సమయం కావాలని అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి అధికారులకు చెప్పారు. ఎస్ఐటీ అధికారుల ముందు రెండుసార్లు హాజరైన గాలి జనార్దన్ రెడ్డి ఈ కేసులో తాను సాక్షాధారాలు ఇచ్చానని మీడియాకు చెప్పారు.

ఏం జరిగింది ?

ఏం జరిగింది ?

చిత్రదుర్గ జిల్లాలోని హోళెల్కెరే తాలుకాలోని హిరేకందవాడి గ్రామంలో 2007 ఆగస్టు 21 నుంచి 2009 ఫిబ్రవరి 14 మధ్యకాలంలో కుమారస్వామి లంచం తీసుకుని అక్రమ మైనింగ్ కు అనుమతి ఇచ్చారని ఆరోపణలు రావడంతో కేసు నమోదైయ్యింది. జంతకల్ మైనింగ్ కంపెనీ విశ్వభారతి హౌసింగ్ కో ఆపరేటివ్ సోసైటీ నుంచి కుమారస్వామి భార్య అనితా కుమారస్వామికి స్థలాలు కేటాయించిందని ఆరోపణలు రావడంతో కేసు నమోదైయ్యింది. ఈ కేసు నుంచి విమక్తి రావడంతో మాజీ సీఎం కుమారస్వామి ఊపిరిపీల్చుకున్నారు.

English summary
Janthakal Mining Case: Karnataka former CM HD Kumaraswamy get big releif as latest Chargesheet filed by SIT doesn't mention Kumaraswamy's name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X