వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలుగు నెలలుగా కోమాలోనే మాజీ కేంద్రమంత్రి జశ్వంత్ సింగ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి జశ్వంత్ సింగ్(76) ఆరోగ్య ఇంకా మెరుపడలేదు. నాలుగు నెలలుగా ఆయన కోమాలోనే ఉన్నారు. గత ఆగస్ట్ 8న ఇంట్లోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఆయనను కుటుంబసభ్యులు ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించారు.

ఆయనను ప్రతి రోజూ వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తోందని కుటుంబసభ్యులు తెలిపారు. అప్పటికే ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. జశ్వంత్ సింగ్ ఆస్పత్రిలో చేరి సోమవారానికి నాలుగు దాటింది. అయినా ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఏమాత్రం మెరుగుదల కనిపించలేదు.

Jaswant Singh still in coma after four months

న్యూరోసర్జన్లు, క్రిటికల్ కేర్ నిపుణులు పర్యవేక్షిస్తున్నారని, జశ్వంత్ సింగ్‌ను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నామని ఆస్పత్రి వైద్యులు వివరించారు. ఆయన ప్రస్తుతం టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ మీద ఆధారపడ్డారు.

అటల్ బీహారీ వాజ్‌పాయి ప్రభుత్వంలో జశ్వంత్ సింగ్ కేంద్రమంత్రిగా పని చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేయాలని భావించినప్పటికీ.. జశ్వంత్ సింగ్‌కు పార్టీ నుంచి టికెట్ రాలేదు. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

English summary
Four months since former Union minister Jaswant Singh was hospitalized with a severe head injury, the former BJP leader continues to be in coma and showing no sign of improvement in health, doctors said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X