• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జాట్లు విధ్వంసకారులు కాదు: సెహ్వాగ్(పిక్చర్స్)

|

న్యూఢిల్లీ: హర్యానాతోపాటు పలు రాష్ట్రాల్లో రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న జాట్ వర్గీయులు హింసా మార్గాన్ని త్యజించాలని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ, క్రికెటర్ యువరాజ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. జాట్లు రక్షకులే గానీ, హింసను కోరుకునే వారు కాదని అన్నారు.

రిజర్వేషన్ల కోసం హర్యానాలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా విధ్వంసం సృష్టిస్తున్న జాట్ సోదరులను అలాంటి చర్యలకు దిగవద్దని సూచించాడు. ఈ మేరకు తన ట్విట్టర్లో జాట్ సోదరులకు విజ్ఞప్తి అంటూ సందేశాలను పోస్ట్ చేశాడు.

'జాట్లు రక్షకులేగానీ, విధ్వంసకారులు' కాదు అని పేర్కొన్నాడు. రాజ్యాంగ బద్ధంగా నడుచుకుంటూ రిజర్వేషన్ల అంశంపై తమ డిమాండ్లను వ్యక్తపరచాలని సూచించాడు. డాషింగ్ బ్యాట్స్ మన్, మాజీ క్రికెటర్ సెహ్వాగ్ స్వతహాగా జాట్ వర్గానికి చెందిన వాడన్న విషయం తెలిసిందే.

క్రీడలు, ఆర్మీ, తమకు ఇష్టమున్న రంగాల్లో మన సత్తాచాటి దేశం గర్వపడేలా చేయాలని హింసాత్మక పనులు చేయవద్దంటూ కోరాడు. మరోవైపు రోహ్‌తక్, జింద్, భిబానీ, ఝజ్జర్, హిస్సార్ తదితర జిల్లాల్లో ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో సామాన్య జనజీవనం ఇక్కట్లుకు గురవుతోంది.

కాగా, ఆందోళన విరమించాలని హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టార్ జాట్ వర్గీయులను కోరుతున్నప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో హర్యానాలో ఉద్యమం నేపథ్యంలో జాట్లకు రిజర్వేషన్ల కల్పనపై ఐదుగురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీని నియమించినట్లు బిజెపి ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆదివారం రాత్రి ఈ విషయం వెల్లడించారు.

యూవీ, సెహ్వాగ్

యూవీ, సెహ్వాగ్

హర్యానాతోపాటు పలు రాష్ట్రాల్లో రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న జాట్ వర్గీయులు హింసా మార్గాన్ని త్యజించాలని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ, క్రికెటర్ యువరాజ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. జాట్లు రక్షకులే గానీ, హింసను కోరుకునే వారు కాదని అన్నారు.

జాట్ల ఆందోళనతో నిలిచిన వాహనాలు

జాట్ల ఆందోళనతో నిలిచిన వాహనాలు

ఆందోళన విరమించాలని హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టార్ జాట్ వర్గీయులను కోరుతున్నప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో హర్యానాలో ఉద్యమం నేపథ్యంలో జాట్లకు రిజర్వేషన్ల కల్పనపై ఐదుగురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీని నియమించినట్లు బిజెపి ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆదివారం రాత్రి ఈ విషయం వెల్లడించారు.

జాట్ల విధ్వంసం

జాట్ల విధ్వంసం

ప్రభుత్వ ఉద్యోగాల్లో జాట్లకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండును పరిశీలించడానికి నియమించిన ఈ కమిటీకి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు నేతృత్వం వహిస్తారని తెలిపారు. సమస్యకు పరిష్కార మార్గాలు సూచిస్తూ సమగ్ర నివేదికను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాల్సిందిగా కోరామని తెలిపారు.

పోలీసుల పహారా

పోలీసుల పహారా

హర్యానాలో పరిస్థితులపై కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్‌, మనోహర్‌ పారికర్‌లతో చర్చించిన తర్వాత హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. అంతకుముందు జాట్ల ప్రతినిధి బృందం హోంమంత్రితో భేటీ అయింది. హర్యానాలో జాట్లకు ఓబీసీ రిజర్వేషన్‌ కల్పించడం గురించి రాబోయే శాసనసభ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేలా చూస్తామని ఈ సమావేశంలో హామీ లభించింది.

జాట్ల ఆందోళన

జాట్ల ఆందోళన

పార్టీ కమిటీ ఏర్పాటుపై భాజపా ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నేతృత్వంలో మరో ఇద్దరు కేంద్ర మంత్రులు మహేశ్‌శర్మ, సంజీవ్‌ బల్యాన్‌, పార్టీ ఉపాధ్యక్షులు సత్పాల్‌మాలిక్‌, అవినాశ్‌రాయ్‌ ఖన్నాలు దీనిలో ఉంటారని తెలిపింది. ఈ కమిటీని పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా నియమించారని వివరించింది.

జాట్ల విధ్వంసం

జాట్ల విధ్వంసం

తక్షణం పని ప్రారంభించే ఈ కమిటీ... పార్టీ అధినేతకు త్వరలోనే నివేదిక సమర్పిస్తుందని తెలిపింది. అమిత్‌షా ఈ నివేదికను పరిశీలించి పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

English summary
India cricketer Yuvraj Singh and former Indian cricketer Virender Sehwag on Sunday appealed to protestors, who have been rampaging in Haryana demanding reservation for the Jat community, to shun violence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X