• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఓట్ల కోసం జవాన్లను పొట్టనబెట్టుకున్నారు: పుల్వామా దాడి వెనుక మోడీ కుట్ర: తిమింగలాలను పట్టుకుంటాం!

|

న్యూఢిల్లీ: సమాజ్ వాది పార్టీ సంచలన ప్రకటన చేసింది. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద కిందటి నెల 14వ తేదీన చోటు చేసుకున్న జైషె మహమ్మద్ ఉగ్రవాదుల దాడి వెనుక భారీ కుట్ర దాగి ఉందని సమాజ్ వాది పార్టీ సీనియర్ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ అన్నారు.

మ‌ళ్లీ ఒకే ఒర‌లో రెండు క‌త్తులు..! ఖ‌మ్మం జిల్లాలో గులాబీ ఉనికి కి మ‌రింత ప్ర‌మాద‌మేనా..?

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోడీ ప్రభుత్వం ఈ కుట్ర పన్నిందని అన్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే.. పుల్వామా ఉగ్రవాదుల దాడిపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని ఆయన చెప్పారు. అసలు దోషులను వెలుగులోకి తీసుకొస్తామని అన్నారు.

 ‘Jawans were killed for votes’: SP leader calls Pulwama attack a conspiracy

ఎన్నికల ప్రచారంలో భాగంగా.. గురువారం ఆయన ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో జిల్లాలో పర్యటించారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఓటు బ్యాంకును కొల్లగొట్టాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం.. పుల్వామా ఉగ్రవాదుల దాడికి కారణమైందని అన్నారు.

దేశంలో పారా మిలటరీ బలగాలేవీ మోడీ ప్రభుత్వం పట్ల సంతోషంగా లేవని చెప్పారు. ఓట్ల కోసం జవాన్లను పొట్టనబెట్టుకుంటున్నారని విమర్శించారు. అవంతిపురా వద్ద జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై సీఆర్పీఎఫ్ కాన్వాయ్ బయలుదేరి వెళ్లడానికి ముందు- అక్కడ తనిఖీలు చేయడం ఆనవాయితీ అని గుర్తు చేశారు. ఉగ్రవాదుల దాడికి ముందు జాతీయ రహదారిపై తనిఖీలు చేయలేదని అన్నారు.

సీఆర్పీఎఫ్ జవాన్లను ఓ సాధారణ బస్సులో పంపించడం కూడా పలు అనుమానాలను లేవనెత్తుతోందని రామ్ గోపాల్ యాదవ్ తెలిపారు. సాధారణ బస్సుల్లో జవాన్లను తరలించడం వెనుక కుట్ర దాగి ఉందని చెప్పారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే పుల్వామా ఉగ్రవాదుల దాడి ఘటనపై విచారణ చేయిస్తామని అన్నారు. ఈ విచారణ సందర్భంగా అనేక తిమింగలాలు బయటికి వస్తాయని చెప్పారు.

 ‘Jawans were killed for votes’: SP leader calls Pulwama attack a conspiracy

పుల్వామా ఉగ్రవాదుల దాడి అనంతరం పాకిస్తాన్ తో యుద్ధపూరిత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటన చోటు చేసుకున్న 12 రోజుల తరువాత మనదేశ వైమానిక దళం జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ అవతల, పాకిస్తాన్ భూభాగంపై ఉన్న బాలాకోట్ పై బాంబులను జార విడిచింది. బాలాకోట్ సమీపంలోని పర్వతాల్లో జైషె మహమ్మద్ కు చెందిన అతి పెద్ద ఉగ్రవాద శిక్షణా శిబిరాన్ని నేలమట్టం చేశాయి మన దేశ వైమానిక బలగాలు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
Samajwadi Party leader Ram Gopal Yadav has revived attack on the Narendra Modi government over Pulwama terror strike owned by Pakistan-based terror outfit Jaish-e-Mohammed. Yadav has called the Pulwama terror attack a “conspiracy” in which “soldiers were killed for vote”. The SP leader said if the government changes in 2019 Lok Sabha election, and a probe is conducted into the Pulwama terror attack, “big fish” will be caught.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+10344354
CONG+38790
OTH128597

Arunachal Pradesh

PartyLWT
BJP42731
JDU167
OTH3710

Sikkim

PartyLWT
SKM11617
SDF21315
OTH000

Odisha

PartyLWT
BJD10112113
BJP22022
OTH11011

Andhra Pradesh

PartyLWT
YSRCP0150150
TDP02424
OTH011

-
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more