వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాంపూర్ కా రాణి కంట కన్నీరు : ఎస్పీ నేతలు బెదిరిస్తున్నారన్న జయప్రద, అండగా నిలిచిన బీజేపీ

|
Google Oneindia TeluguNews

రామ్‌పూర్ : ఇటీవలే బీజేపీలో చేరిన జయప్రద సభ వేదికపై బోరున ఏడ్చారు. తాను బీజేపీలో చేరడాన్ని కొందరు జీర్ణించుకోలేరన్నారు. బీజేపీలో చేరొద్దని, రాంపూర్ నుంచి పోటీచేయొద్దని బెదిరించారని రోదించారు. వెంటనే అక్కడున్న కార్యకర్తలు ఆమెను ఓదార్చి .. అండగా మేమున్నామంటూ ధైర్యం నూరిపోశారు.

 Jaya Prada Breaks Down At Rampur Rally

బర్త్ డే గిప్ట్ .. బెదిరింపులు
తన పుట్టిన రోజున బీజేపీ రాంపూర్ టికెట్ ఇచ్చి బహుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని భావించానని తెలిపారు. అయితే ఎస్పీ నేత అజాంఖాన్ తనపై ఆరోపణలు చేశారని ... రాంపూర్ వదిలివెళ్లాలని బెదిరించారని వెల్లడించారు. ఇక్కడే ఉండే యాసిడ్ దాడులు చేస్తానని హెచ్చరించారని గద్గత స్వరంతో రోదించారు. మీకు అండగా మేమున్నామంటూ కార్యకర్తలు ధైర్యం చెప్పడంతో తేరుకున్నారు.

ఇంకెప్పుడు ఏడవను, అండగా బీజేపీ
తన వెనక బీజేపీ ఉంది. ఇంతకుముందులా ఏడవను, తనకు జీవించే హక్కు ఉన్నది, ఎవరూ ఏమీ చేయలేరు అని పేర్కొన్నారు జయప్రద. ప్రజాసేవ కోసం బీజేపీ మంచిదనిపించి చేరానని తెలిపారు. రాంపూర్ నుంచి గెలవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని .. మరోసారి ప్రజాసేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రజల ఆశీర్వాదం ముందు ఏ బెదిరింపులు పనిచేయవని స్పష్టంచేశారు.

English summary
Actor-turned-politician Jaya Prada broke down at a public rally in Uttar Pradesh's Rampur, where she launched her campaign today as a BJP candidate. Alleging that she had been forced to leave Rampur, her former constituency, because of attacks by Samajwadi Party leader Azam Khan, she paused and wiped her tears as BJP supporters shouted "Jaya Prada ji we are with you in your fight."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X