ఢిల్లీ షాక్: బీజేపీలోకి జయప్రద, అమర్‌సింగ్ చర్చ: కేజ్రీవాల్‌పై పోటీ?
న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం ఆమె బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆమె ఒకటి రెండు రోజుల్లో కమలం పార్టీ తీర్థం పుచ్చుకోవచ్చు.
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పైన పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు జయప్రద చెప్పినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తొలి జాబితాను విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
గత లోకసభ ఎన్నికల్లో జయప్రద బీజనూర్ నుంచి ఆరెల్డీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీలో చేరేందుకు ఆమె ఇప్పటికే మూడుసార్లు పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారు. ఢిల్లీ నియోజకవర్గం నుంచి జయప్రద పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

ఈ సందర్భంగా జయప్రద గురువారం మీడియాతో మాట్లాడారు. బీజేపీలో చేరే విషయమై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతానన్నారు. అమర్ సింగ్ కూడా చర్చిస్తున్నారన్నారు. పాలనలో మార్పులు తీసుకు వచ్చే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. తనకు బీజేపీలో చేరాలని ఉందన్నారు.
ప్రధాని మోడీ పని చేస్తున్నారని, ఆయన పనితీరు బాగుందన్నారు. మోడీని ప్రధానిగా ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన నాయకత్వంలో పని చేయాలని ఉందని, ఒక కార్యకర్తగా పని చేస్తానన్నారు. తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదన్నారు. బీజేపీలో చేరే విషయమే త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు. కాగా, అరవింద్ కేజ్రీవాల్ పైన షాజియా ఇల్మీ కూడా పోటీకి దిగనుందనే ఊహాగానాలు వినిపించాయి.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications