వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీ ఫామ్ లో జయలలిత వేలిముద్ర: ఓకే చెప్పిన డాక్టర్ కు రూ. లక్షలు లంచం !

అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో జరిగిన ఉప ఎన్నికల సందర్బంగా సమర్పించిన బీ ఫామ్ లో జయలలిత వేలి ముద్ర వేశారని, వేలి ముద్ర జయలలితదే అని దృవీకరించిన డాక్టర్ బాలాజీకి ఆరోగ్య శాఖా మంత్రి

|
Google Oneindia TeluguNews

నై: గత ఏడాది తంజావూరు, అరవకురిచ్చి, తిరప్పరగుండ్ర ఉప ఎన్నికలు జరిగిన సమయంలో జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో బీ ఫామ్ మీద జయలలిత వేలిముద్రలు వేసి ఉండటం వెలుగులోకి వచ్చింది.

<strong>ఆరోగ్య శాఖా మంత్రికి షాక్: అనుచరుడి ఇంట్లో రూ. కోట్లు సీజ్ !</strong>ఆరోగ్య శాఖా మంత్రికి షాక్: అనుచరుడి ఇంట్లో రూ. కోట్లు సీజ్ !

Jaya puts thumb impression instead of signature on party candidetes’ nominations

జయలలిత వేలిముద్రపై అప్పట్లో పెద్దవివాదం బయలుదేరింది. ప్రభుత్వ వైద్యుడి సమక్షంలోనే జయలలిత వేలిముద్ర వేశారని అన్నాడీఎంకే నాయకులు అప్పట్లో వివరణ ఇచ్చారు. మద్రాస్ మెడికల్ కాలేజ్ ప్రోఫెసర్ డాక్టర్. పి. బాలాజీ సైతం బీ ఫామ్ లో ఉన్న వేలి ముద్ర జయలలితదే అని దృవీకరించారు.

తరువాత ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న సమయంలో తంజావూరు, అరవకురిచ్చి, తిరప్పరగుండ్ర ఉప ఎన్నికలు పూర్తి అయ్యాయి. అయితే ఇంత వరకూ బాగానే ఉన్నా, బీ ఫామ్ లో ఉన్న వేలి ముద్ర జయలలితదే అని దృవీకరించిన ప్రభుత్వ వైద్యుడు బాలాజీకి రూ. 5 లక్షలు లంచం ఇచ్చారని తాజాగా వెలుగు చూసింది.

<strong>ఆర్ కే నగర్ లో రూ. 80 కోట్లు పంచేశారు: మొత్తం లెక్కలేస్తే, ఆ వీడియోనే !</strong>ఆర్ కే నగర్ లో రూ. 80 కోట్లు పంచేశారు: మొత్తం లెక్కలేస్తే, ఆ వీడియోనే !

తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ స్వయంగా మద్రాస్ మెడికల్ కాలేజ్ ప్రోఫెసర్ డాక్టర్. పి. బాలాజీకి రూ. 5 లక్షలు లంచం ఇచ్చారని ఓ ఆధారం ఆదాయపన్ను శాఖ అధికార వర్గాలకు లభించడం గమనార్హం.

ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ఇంటిలో సోదాలు చేసే సమయంలో ఆ ఆధారం ఐటీ శాఖ అధికారుల చేతికి చిక్కిందని వెలుగు చూసింది. ఇప్పుడు మద్రాస్ మెడికల్ కాలేజ్ ప్రోఫెసర్ డాక్టర్. పి. బాలాజీని ఐటీ శాఖ అధికారులు పిలిపించి విచారణ చేసే అవకాశం ఉందని తెలిసింది.

English summary
Dr P Balaji who is a Professor at the Madras Medical College has denied that the payment of ₹5 lakh from Health Minister Vijaya Baskar for the attested Jayalalithaa's thumb.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X