బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విచారణకు హాజరైన శశికళ మేనల్లుడు, ఆసుపత్రిలో జయలలితకు, చెమటలు, వీడియో!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ జరుపుతున్న మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు మంగళవారం శశికళ మేనల్లుడు, జయా టీవీ సీఇవో, జాజ్ సినిమాస్ యజమాని వివేక్ హాజరైనాడు. ఆసుపత్రిలో జయలలిత దగ్గరకు ఎన్నిసార్లు వెళ్లారు, ఏం జరిగింది, వీడియో ఎవరు తీశారు అని ప్రశ్నలు వెయ్యడంతో వివేక్ కు చెమటలు పట్టాయని తెలిసింది.

 జస్టిస్ ప్రశ్నలు

జస్టిస్ ప్రశ్నలు

జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ శశికళ మేనల్లుడు జయా టీవీ సీఇవో వివేక్ కు సమన్లు జారీ చేశారు. ఫిబ్రవరి 13వ తేదీ మంగళవారం విచారణకు హాజరుకావాలని వివేక్ సూచించారు. విచారణ కమిషన్ ముందు హాజరైన వివేక్ కు జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించిందని తెలిసింది.

అపోలో ఆసుపత్రిలో

అపోలో ఆసుపత్రిలో

జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో శశికళతో పాటు మీరు ఎన్నిసార్లు అక్కడికి వెళ్లారు. చికిత్స ఏలా చేశారు. ఆ సమయంలో తీసిన వీడియో మీ దగ్గరకు ఎలా వచ్చింది అని వివేక్ ను జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ప్రశ్నించిందని తెలిసింది.

జయా టీవీ, పోయెస్ గార్డెన్

జయా టీవీ, పోయెస్ గార్డెన్

అన్నాడీఎంకే పార్టీకి చెందిన జయా టీవీ మీ సొంతం ఎలా అయ్యింది అని వివేక్ జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ప్రశ్నించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతే కాకుండా జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ మీ ఆధీనంలోకి ఎలా వచ్చింది అని ప్రశ్నించారని తెలిసింది.

వివేక్ కు చెమటలు

వివేక్ కు చెమటలు

జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ వేసిన ప్రశ్నలకు వివేక్ ఉక్కిరిభిక్కిరి అయ్యి చెమటలు పట్టాయని సమాచారం. విచారణ పూర్తి అయిన తరువాత బయటకు వచ్చిన వివేక్ మీడియా అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మిగిలింది చిన్నమ్మ

మిగిలింది చిన్నమ్మ

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళను విచారణ చెయ్యడానికి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ సిద్దం అయ్యింది. శశికళను విచారణ చేస్తే నివేదిక ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలిసింది.

English summary
Following summons issued to him recently, Jaya TV CEO Vivek Jayaraman on Tuesday appeared before the commission investigating the death of former Tamil Nadu chief minister and AIADMK supremo J Jayalalithaa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X