వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుని ఫాలో అయిన జయలలిత : ఆ ఫైలు పైనే తొలి సంతకం

|
Google Oneindia TeluguNews

చెన్నై : మొత్తానికి తమిళ రాజకీయ సాంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. వరుసగా రెండోసారి తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు జయలలిత. ఏపీలో చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చిన రుణమాఫీ మంత్రాన్ని జయలలిత కూడా తమిళనాడు ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు. ఇదే క్రమంలో సీఎంగా ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే, చంద్రబాబు తరహాలోనే తొలి సంతకాన్ని రుణమాఫీ ఫైలుపై చేశారు.

అదేవిధంగా.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన పలు హామీలను నెరవేరుస్తామని తమిళ ప్రజలకు మాటిచ్చారు. ఇందులో భాగంగానే క్రమ క్రమంగా మధ్యం దుకాణాల సంఖ్యను తగ్గించేందుకు గాను త్వరలోనే 500 రిటైల్ మధ్యం దుకాణాల మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. మధ్యం విక్రయాల్లో పాత పద్దతిలో ఉదయం 10 గంటలకు కాకుండా ఇకనుంచి మధ్యాహ్నం 12 గంటలకు మధ్యం దుకాణాలను తెరిచేలా చర్యలు తీసుకోనున్నారు.

jayalalita first sign for crop loan waiver

ప్రమాణ స్వీకారం సందర్బంగా, మధ్యం దుకాణాల కుదింపుతో పాటుగా పలు ఇతరు వరాలు కూడా కురిపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం పూట అల్పహారం, ప్రతి ఇంటికి వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చేనేత కార్మికులకైతే 700 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి తీసుకురానున్నారు.

జయలలితతో పాటుగా 28 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 13 మంది కొత్తవారికి కేబినెట్ లో చోటు దక్కడం గమనార్హం.

English summary
Waiver of all crop loans availed by farmers to the tune of Rs.5,780 crore, 100 units of free power to 78 lakh families at a cost of Rs.1,607 crore, increasing the four gram gold to one sovereign, given under various marriage assistance schemes, 200 unit and 750 unit free power supply to handloom and powerloom weavers respectively are the four files signed by her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X