India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారసులకే దక్కిన జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ .. అత్త ఇంట్లో కాలుపెట్టిన మేనకోడలు దీప!!

|
Google Oneindia TeluguNews

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసమున్న అమ్మ వేద నిలయం ఎట్టకేలకు వారసులకే దక్కింది. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ పోరాటం ఫలించింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత మరణం తర్వాత పోయెస్ గార్డెన్ తమకే దక్కుతుందని న్యాయ పోరాటం చేసి మరి అమ్మ నివాసమైన వేద నిలయాన్ని దక్కించుకున్నారు జయలలిత వారసులు . ఈ మేరకు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె.జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌కు చెన్నై జిల్లా యంత్రాంగం తాళాలు అందజేయడంతో శుక్రవారం సాయంత్రం ఆమె తన అత్త పోయెస్ గార్డెన్ నివాసాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సామాన్యుల దృష్టిని ఆకర్షిస్తున్న స్టాలిన్ ; ఆరో తరగతి విద్యార్థినికి ఫోన్ చేసిన తమిళనాడు సీఎం .. ఎందుకంటే !!సామాన్యుల దృష్టిని ఆకర్షిస్తున్న స్టాలిన్ ; ఆరో తరగతి విద్యార్థినికి ఫోన్ చేసిన తమిళనాడు సీఎం .. ఎందుకంటే !!

 వారసులకే దక్కిన జయలలిత నివాసం పోయెస్ గార్డెన్

వారసులకే దక్కిన జయలలిత నివాసం పోయెస్ గార్డెన్


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అసలైన వారసులు తామేనని ఆమె నివాసం లోని పోయెస్ గార్డెన్ పై హక్కు తమకే దక్కాలని కోర్టుకెక్కిన జయలలిత అన్న కుమార్తె దీప, ఆమె సోదరుడు దీపక్ ఎట్టకేలకు పోయెస్ గార్డెన్ ను స్వాధీనం చేసుకున్నారు. జయలలిత మరణం తర్వాత గత అన్నాడీఎంకే ప్రభుత్వం ఈ బంగ్లాను స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ దీపా, ఆమె సోదరుడు దీపక్‌లు దాఖలు చేసిన పిటిషన్ల నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఆస్తి వారికే చెందాలని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది .

మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జ్ ఉత్తర్వులు ...

మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జ్ ఉత్తర్వులు ...


అంతేకాదు కుటుంబానికి చెల్లించాల్సిన కోర్టులో డిపాజిట్ చేసిన నష్టపరిహారం నగదును తిరిగి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇక ఈ కేసును విచారించిన న్యాయస్థానం మెరీనా బీచ్ లో ఇప్పటికే జయలలిత స్మారక మందిరం ఉందని, ఇప్పుడు మరోది ఎందుకని ప్రశ్నించింది.ఇప్పటికే కొన్ని కిలోమీటర్ల దూరంలో మెరీనా (బీచ్) వెంబడి జయలలితకు 80 కోట్ల విలువైన స్మారక చిహ్నం ఉంది. 80 కోట్ల మెరీనా మెమోరియల్ అందించని స్పూర్తిదాయకమైన కథ వేదనిలయంలో ఏముంది అని ప్రశ్నించింది కోర్టు.

కోర్టు తీర్పుపై దీప, దీపక్ లు సంతోషం.. ఇంటి తాళాలు అందుకున్న వారసులు

కోర్టు తీర్పుపై దీప, దీపక్ లు సంతోషం.. ఇంటి తాళాలు అందుకున్న వారసులు

కేసు వాదోపవాదాల అనంతరం జయలలిత నివాసం జయలలిత వారసులైన దీపక్, దీపక్ కు ఇవ్వాలని తేల్చిచెప్పింది. జయలలిత నివాసం వేద నిలయాన్ని స్వాధీనం చేసుకోవాలన్న గత ప్రభుత్వ ఉత్తర్వును పక్కనబెట్టి, చట్టబద్ధమైన వారసులకు అప్పగించాలని మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ నవంబర్ 24న ఆదేశించడంతో ఇంటి తాళాలను శుక్రవారం నాడు దీప కు అందజేశారు అధికారులు.కోర్టు తీర్పుపై దీప, దీపక్ లు సంతోషం వ్యక్తం చేస్తూ ఇంటిని స్వాదీనం చేసుకున్నారు.

అత్త ఇల్లు రాజీకాయలకు వేదిక కాబోదన్నజయలలిత మేనకోడలు

అత్త ఇల్లు రాజీకాయలకు వేదిక కాబోదన్నజయలలిత మేనకోడలు

అత్త లేని సమయంలో నేను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు మేనకోడలు దీప . ఇప్పుడు ఇల్లు నిర్మానుష్యంగా మరియు ఖాళీగా ఉంది. మా అత్త ఉపయోగించిన ఫర్నిచర్ కూడా తీసేసారు అని ప్రస్తుత పోయెస్ గార్డెన్ పరిస్థితిని వెల్లడించారు దీప. తన అత్త ఇంట్లో తాము నివసించడం తనకు సంతోషంగా ఉందని ఆమె వెల్లడించారు. గతంలో రాష్ట్రంలోని ఏఐఏడీఎంకే హయాంలో జయలలిత కుటుంబాన్ని సంప్రదించకుండానే ఇంటిని స్వాధీనం చేసుకుని స్మారక చిహ్నంగా మార్చారు. తాజాగా పోలీస్ గార్డెన్ కు వెళ్ళిన దీప తన భర్త మాధవన్ మరియు శ్రేయోభిలాషులతో కలిసి ఇంట్లో అడుగు పెట్టారు. జయలలిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇది నా పుట్టిన స్థలం అతనితో కలిసి గడిపిన జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్న దీప, ఇది ఇక ముందు రాజకీయాలకు వేదిక కాబోదని స్పష్టంగా చెప్పారు.

English summary
The residence of the late Chief Minister of Tamil Nadu Jayalalithaa, has finally been handed over to the heirs. After Jayalalitha death, her heirs fought for justice for the right on Poes Garden and secured the Vedic abode where her mother in law resides
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X