వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియోలో ఉన్నది జయలలిత కాదు, అమ్మ ఫ్రెండ్ గీతా, శశికళ ఏం చేశారంటే ?

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందక ముందు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియో నకిలి, దానిని సరికొత్త టెక్నాలజీతో సృష్టించారని అమ్మ స్నేహితురాలు గీతా ఆరోపించారు.

 వీడియోలో ఉన్నది అమ్మ కాదు

వీడియోలో ఉన్నది అమ్మ కాదు

గురువారం టీటీవీ దినకరన్ వర్గం విడుదల చేసిన వీడియోలో ఉన్నది తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కాదని ఆమె స్నేహితురాలు గీతా అన్నారు. టీవీలో తాను వీడియో చూశానని, అందులో ఉన్నది వంద శాతం జయలలిత కాదని గీతా చెప్పారు.

Recommended Video

Jayalalithaa Daughter Issue : అమృత మీద చట్టపరంగా పరువు నష్టం దావా
మార్ఫింగ్ వీడియో

మార్ఫింగ్ వీడియో

సరికొత్త టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి వీడియోలో ఉన్నది జయలలిత అని నమ్మించడానికి శశికళ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని, ఆ వీడియోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పరిశీలించాలని జయలలిత స్నేహితురాలు గీతా డిమాండ్ చేశారు.

 ఆసుపత్రికి వెళ్లే ముందే అమ్మ ?

ఆసుపత్రికి వెళ్లే ముందే అమ్మ ?

జయలలిత ఆసుపత్రిలో చేర్చేనాటికే మృతిచెందారని గతంలో ఆరోపణలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అప్పట్లో టీటీవీ దినకరన్‌ కూడా స్పందించారు. అమ్మ ఆసుపత్రిలో బతికే ఉందని చెప్పేందుకు తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని టీటీవీ దినకరన్ చెప్పారు.

 అమ్మ కోసం !

అమ్మ కోసం !

తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి బయటకు విడుదల చెయ్యరాదని జయలలిత చెప్పారని, అమ్మ కోరిక మేరకు వాటిని విడుదల చెయ్యబోమని టీటీవీ దినకరన్ అన్నారు.

ఇప్పుడు ఎవరి కోసం ?

ఇప్పుడు ఎవరి కోసం ?

గురువారం టీటీవీ దినకరన్ వర్గం అనర్హత ఎమ్మెల్యే వెట్రివేల్ ఈ వీడియోను బహిర్గతం చేయడం గమనార్హం. ఇప్పుడు ఎవరి కోసం ఈ వీడియో విడుదల చేశారు అనే ప్రశ్నకు మన్నార్ గుడి మాఫియా సమాధానం చెప్పాలని తమిళనాడు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

విచారణ కమిషన్ కు వీడియో !

విచారణ కమిషన్ కు వీడియో !

జయలలిత మృతిపై దర్యాప్తు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ కమిషన్‌ అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియో అంటూ విడుదల చేసిన క్లిప్పింగ్స్ పరిశీలిస్తున్నారు.

English summary
Jayalalithaa's friend Geetha accuses the person in the video is not Jayalalithaa, its a morphed video and with the technology and robo Sasikala team made this video.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X