వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత మృతి: అధికారిక ప్రకటన, పన్నీరు సెల్వం కొత్త ముఖ్యమంత్రి

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇక లేరు అని అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇక లేరు. జయ మృతి చెందినట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు సోమవారం అర్ధరాత్రి పన్నెండుంపావుకు అధికారికంగా ప్రకటించాయి. ఆమె సోమవారం రాత్రి గం.11.30 నిమిషాలకు మృతి చెందినట్లు తెలిపాయి. జయలలిత 74 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే.

సస్పెండైన శశికళ పుష్పకు కీలక పదవి?: అపోలో నుంచి జయ తరలింపు!సస్పెండైన శశికళ పుష్పకు కీలక పదవి?: అపోలో నుంచి జయ తరలింపు!

అదే ఆసుపత్రిలో జయలలిత (68) కన్నుమూశారు. తమిళ, దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన జయ కన్నుమూతతో యావత్ దేశం శోక సముద్రంలో మునిగింది. అమ్మగా అండగా ఉంటూ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పేదవాడి కంటనీరును తుడిచిన ఆమె లేవన్న వార్తను చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు.

jayalalithaa

రెండున్నర నెలలుగా అస్వస్థతతో వున్న ఆమె గుండెపోటుతో అపోలో ఆసుపత్రిలో కన్నుమూసినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కొన్నాళ్ల క్రితం కోలుకున్న ఆమెకు తాజాగా గుండె నొప్పి రావడంతో ఢిల్లీ నుంచి వచ్చినప్రత్యేక వైద్య బృందాలు చికిత్స అందించాయి. వైద్యల ప్రయత్నాలు ఫలించలేదు.

ఫిబ్రవరి 24, 1948లో జన్మించిన ఆమె తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో కథానాయకిగా ఓ వెలుగు వెలిగారు. అనంతరం ఎంజీఆర్‌ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె ఆయన మరణానంతరం 1991 నుంచి 1996 వరకూ ముఖ్యమంత్రిగా పని చేశారు.

jayalalithaa

మళ్లీ 2001లో మే 14 నుంచి సెప్టెంబర్‌ 21 వరకూ, 2002 నుంచి 2006 వరకూ, 2011 నుంచి 2014 వరకూ, మే 23, 2015 నుంచి మే 19, 2016 వరకూ.. మే 19, 2016 నుంచి ఇప్పటి వరకూ ముఖ్యమంత్రిగా సేవలందించారు.

పన్నీరు సెల్వంకు ఝలక్, మద్దతు లేదు: 'ముఖ్యమంత్రి'పై ఉత్కంఠపన్నీరు సెల్వంకు ఝలక్, మద్దతు లేదు: 'ముఖ్యమంత్రి'పై ఉత్కంఠ

అంతకుముందు హడావుడి

అంతకుముందు అపోలో ఆసుపత్రి వద్ద హంగామా కనిపించింది. హఠాత్తుగా పరిణామాలు మారిపోయాయి. సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు అపోలో ఆసుపత్రి పైన జయ అభిమానులు దాడి చేసిన విషయం తెలిసిందే.

పోలీసుల మోహరింపు

ఈ నేపథ్యంలో జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం వచ్చినా ఉద్రిక్తత చోటు చేసుకోకుండా పోలీసులు మోహరించారు. సోమవారం రాత్రికి.. అపోలో ఆసుపత్రి వద్ద జయ అభిమానులు చాలా తక్కువగా ఉన్నారు. దాదాపు వారిని పోలీసులు ఖాళీ చేయించారు. అదే సమయంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

వెళ్లిపోయిన ప్రతాప్ సి రెడ్డి

అపోలో ఆసుపత్రి నుంచి ఎయిమ్స్ వైద్యులు వెళ్లిపోయారు. అలాగే, అపోలో ఆసుపత్రుల అధినేత ప్రతాప్ సి రెడ్డి కూడా ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు. ఆసుపత్రి గేట్లు మూసివేశారు.

జయ ఇంటి వరకు భారీ భద్రత, వెళ్లిపోతున్న నేతలు

అపోలో ఆసుపత్రి నుంచి జయలలిత ఇంటి వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే అపోలో నుంచి జయను ఇంటికి తరలించేందుకు అలా సిద్ధం చేశారు. అపోలో నుంచి జయ ఇంటి వరకు భారీ కారిడార్.. అంటే పోలీసులతో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

అపోలో నుంచి జయ ఇంటి వరకు మూడు కిలోమీటర్లు ఉంటుంది. జయను తరలించేందుకు అంబులెన్సుతో పాటు ప్రత్యేక కాన్వాయ్ సిద్ధం చేశారు. ఆసుపత్రి నుంచి అన్నాడీఎంకే కార్యాలయానికి నాయకులు వెళ్లిపోయారు.

రాజ్ భవన్‌కు పన్నీరు సెల్వం

అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజ్ భవన్ బయలుదేరనున్నారు. ఎమ్మెల్యేలు, నేతల తరలింపు కోసం మూడు బస్సులు అన్నాడీఎంకే కార్యాలయం వద్ద సిద్ధంగా ఉన్నాయి. జయలలిత మృతి నేపథ్యంలో ఓ పన్నీరు సెల్వం కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

English summary
jayalalithaa passes away after a long fight at apollo hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X