వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిద్దరామయ్య చేతిలో జయలలిత భవిష్యత్తు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలితకు మళ్లీ కష్టాలు మొదలవుతాయని తెలుస్తుంది. కర్ణాటక హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రశ్నిస్తు సుప్రీం కోర్టుకు వెళ్లాల, వద్దా అని గురువారం కర్ణాటక ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఏక సభ్య బెంచ్ తుది తీర్పు వెల్లడించింది. జయలలితకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే తన వాదనలు వినకుండానే న్యాయమూర్తి తుది తీర్పు వెల్లడించారని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.వి. ఆచార్య ఆరోపణలు చేశారు.సుప్రీం కోర్టుకు వెళ్లాలని కర్ణాటక ప్రభుత్వానికి లేఖ వ్రాశారు.

హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో సుప్రీంలో అప్పీలు చెయ్యాల, వద్దా అని చెప్పాలని ప్రభుత్వం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అడ్వకేట్ జనరల్, న్యాయ శాఖ ప్రధాన కారద్యర్శి అభిప్రాయాలు అడిగింది.

 jayalalithaa case, Karnataka government appeal in supreme court ?

ఇప్పటికే ఆ ముగ్గురు తమ అభిప్రాయాలను లేఖల ద్వార ప్రభుత్వానికి చెప్పారు. ఈ ముగ్గురి అభిప్రాయాలను తెలుసుకున్నామని గురువారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో జరిగే మంత్రి వర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని న్యాయశాఖ మంత్రి టి.బి. జయచంద్ర స్పష్టం చేశారు.

సిద్దు మంత్రి వర్గం సుప్రీం కోర్టులో అప్పీలు చెయ్యాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు. కావేరి జలవివాదం, మేకదాటు రిజర్వాయర్ విషయంలో తమిళనాడు ప్రభుత్వం కర్ణాటకకు అడ్డు పడుతున్న సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

సుప్రీంకు వెళతా...... రామస్వామి

తమిళనాడు ప్రభుత్వం ఈ నెల 22వ తేదిన శాసన సభపక్ష సమావేశం ఎర్పాటు చేసి జయలలితకు మళ్లి పట్టం కట్టాలని ప్రయత్నిస్తున్నది. అయితే చెన్నయ్ లో నివాసం ఉంటున్నకే.ఆర్. రామస్వామి అనే వ్యక్తి తాను సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తానని అంటున్నారు. తాను కర్ణాటక హై కోర్టు తీర్పును మాత్రం ప్రశ్నిస్తున్నానని రామస్వామి కొత్త ట్విస్ట్ ఇస్తున్నారు.

English summary
Acharya has been stated in the media as saying that it is a "fit case" for an appeal in the Supreme Court and that he has advised the Karnataka government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X