వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత ఆస్తులు వేలం! కోర్టుకు రూ. 100 కోట్లు ఫైన్ చెల్లించాలి

జయలలిత ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు ఆదేశాల మేరకు ఆమె కోర్టుకు రూ. 100 కోట్లు అపరాద రుసుం చెల్లించాలి.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: జయలలిత ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుతో మంగళవారం సుప్రీం కోర్టు ఏకీభవించింది. కోర్టు ఆదేశాల మేరకు జయలలిత, శశికళ, ఇళవరసి, దివాకరన్ ల నుంచి తమిళనాడు ప్రభుత్వం రూ. 130 కోట్లు వసూలు చేయ్యాలి.

జయలలిత మరణించడంతో ఆమెకు చెందిన ఆస్తులను వేలం వేసి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రూ. 100 కోట్ల అపరాద రుసుం వసూలు చెయ్యాలి. శశికళ, ఇళవరసి, దివాకరన్ ల నుంచి రూ. 30 కోట్ల అపరాద రుసుం వసూలు చెయ్యవలసి ఉంది.

<strong>సీన్ రివర్స్: ఎమ్మెల్యేలతో స్టాలిన్ సమావేశం: అధికారంలోకి డీఎంకే!</strong>సీన్ రివర్స్: ఎమ్మెల్యేలతో స్టాలిన్ సమావేశం: అధికారంలోకి డీఎంకే!

Jayalalithaa DA case:TN government to recover the Rs 100 crore fine !

ఇప్పటికే జయలలితకు చెందిన వజ్రాలు, బంగారు నగలు, ఖరీదైన చీరలతో పాటు వివిద వస్తువులను సీజ్ చేసిన సీబీఐ అధికారులు బెంగళూరు సెషన్స్ కోర్టు ఆవరణంలోని ప్రత్యేక గదిలో భద్రపరిచారు. నిత్యం నలుగురు పోలీసులు ఇక్కడ భద్రత కల్పిస్తున్నారు. జయలలితకు చెందిన వస్తువులతో సహ ఆమె ఆస్తుల ఖరీదు ఎంత అనే విషయంపై ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం అంచనా వేసి కోర్టుకు సమర్పించవలసి ఉంది.

అధికారులు సీజ్ చేసిన జయలలిత వస్తువులు ఇవే !

750 ఖరీదైన పాదరక్షలు- విలువ తెలీదు

10,500 ఖరీదైన చీరలు- విలువ తెలీదు

బంగారు నగలు- రూ.3.50 కోట్లు

వజ్రాలు - రూ. ఒక కోటి

500 వైన్ బాటిల్స్- విలువ తెలీదు

జయలలిత ఆస్తులు ( ఇప్పటి వరకూ అధికారులు స్వాధీనం చేసుకోలేదు) !

చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని వేధనిలయం- తమిళనాడు ప్రభుత్వం ఈ ఆస్తి విలువ లెక్కకట్టాలి

కూడనాడ్ టీ ఎస్టేట్, నీలగిరి- తమిళనాడు ప్రభుత్వం ఆస్తి విలువ లెక్కకట్టాలి

సిరుత్వూర్ బంగ్లా, మహాబలిపురం- రూ. 55 కోట్లు

పయనూర్ బంగ్లా- కొనుగోలు చేసిన ఆస్తి విలువ రూ. 13 లక్షలు ( ప్రస్తుతం ఆస్తి విలువ ఎంత అని తెలీదు)

English summary
The Supreme Court on Tuesday upheld the trial court's order which had convicted Jayalalithaa and also ordered her to pay a fine of Rs 100 crore. The court had fined Sasikala Natarajan, Ilavarasi and Sudhakaran Rs 10 crore each, thus making the total fine Rs 130 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X