వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత మృతిపై విచారణకు ప్రత్యేక కమిటీ: హై కోర్టులో పిటిషన్, సీఎం ఇరికించాలని ప్లాన్ !

తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న శశికళ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ రోజుకో ప్లాన్ వేస్తున్నాడు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న శశికళ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ రోజుకో ప్లాన్ వేస్తున్నాడు. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామిని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ తన మద్దతుదారులను రంగంలోకి దింపాడు.

తమిళనాడు సీఎం పళనిసామికి నైటీ, స్పీకర్ ధనపాల్ కు చీర: రాజీనామా చెయ్యాలని, అరెస్టు !తమిళనాడు సీఎం పళనిసామికి నైటీ, స్పీకర్ ధనపాల్ కు చీర: రాజీనామా చెయ్యాలని, అరెస్టు !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ప్రత్యేక కమిటీ వేయించి విచారణ చేయిస్తామని సీఎం ఎడప్పాడి పళనిసామి ఆగస్టు 17వ తేదీ అధికారికంగా మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తమిళనాడుకు చెందిన కడవాసల్ మురుగదాసమ్ అనే వ్యక్తి శనివారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Jayalalithaa death enquiry commission pil file TN High Court

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ప్రత్యేక కమిటీ వేయించి విచారణ చేయిస్తామని తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి అధికారికంగా ప్రజలకు చెప్పి దాదాపు 40 రోజులు అవుతున్నదని, ఇంత వరకు కమిటీ వెయ్యలేదని, ఈ విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కడవాసల్ మురుగదాసమ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించిన సీఎం పళని, పన్నీర్: అఫిడవిట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేల లిస్ట్ !ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించిన సీఎం పళని, పన్నీర్: అఫిడవిట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేల లిస్ట్ !

మద్రాసు హైకోర్టులో సోమవారం ఈ పిటిషన్ విచారణకు రానుంది. కడువాసన్ మురుగదాసమ్ టీటీవీ దినకరన్ వర్గీయుడు. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామిని ఇరకాటంలో పెట్టడానికి టీటీవీ దినకరన్ ఈ ప్లాన్ వేయించాడని తెలిసింది.

జయలలిత మృతిపై తమిళనాడు ప్రజలు, అమ్మ అభిమానులు శశికళతో పాటు మన్నార్ గుడి మాఫియా మీద అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మన వర్గీయులే ఈ విషయంపై హైకోర్టు ను ఆశ్రయిస్తే ప్రజలు అనుమానించరని మన్నార్ గుడి మాఫియా ఇలా ప్లాన్ వేసిందని సమాచారం.

English summary
AIADMK worker case file petition in high court, Jayalalithaa death enquiry commission. CM Palaniswami has announced on August 17 a Commission of Inquiry to go into the death of J Jayalalithaa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X