వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత అనుమానాస్పద మృతి, డీఎంకే పార్టీ వైద్యుడికి సమన్లు, డేట్, టైం ఫిక్స్, రండి!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి అనుమానాస్పద మృతిపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ కమిటి డీఎంకే పార్టీ వైద్యుడికి సమన్లు జారీ చేసింది. నవంబర్ 22, 23వ తేదీల్లో విచారణ కమిటి ముందు హాజరై వివరణ ఇవ్వాలని డీఎంకే పార్టీకి చెందిన డాక్టర్ శరవణన్ కు శుక్రవారం సమన్లు జారీ చేశారు.

Recommended Video

శశికళ పెరోల్ పై వచ్చి ఏం చేసిందో తెలుసా ? | Oneindia Telugu

జయలలిత మరణంపై ఉన్న అనుమానాలు తొలగించడానికి తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మద్రాసు హై కోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఏ. ఆర్ముగస్వామి నేతృత్వంలో ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపిస్తున్నారు. విచారణ మొదలు పెట్టిన రిటైడ్ న్యాయమూర్తి పలువురికి సమన్ల జారీ చేసి విచారణ చేస్తున్నారు.

Jayalalithaa death inquiry panel summons Dr Saravanan

జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో పని చేస్తున్న 15 మందికి నోటీసులు జారీ చేసి గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీ అమ్మ ఇంటిలో ఏం జరిగింది అంటూ విచారణ చేసి వివరాలు సేకరించారు. జయలలిత మరణంపై చాల అనుమానాలు ఉన్నాయంటూ డీఎంకే పార్టీకి చెందిన వైద్యుడు డాక్టర్ శరవణన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

జయలలిత మరణంపై అనుమానాలు ఉన్నాయని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన డాక్టర్ శరవణన్ ను విచారణ చేసి ఆయన దగ్గర ఏమైనా సాక్షాలు ఉన్నాయా, ఆయనకు ఉన్న అనుమానాలు ఏమిటి అని తెలుసుకోవడానికి విచారణ కమిటీ సమన్లు జారీ చేసింది. ఈనెల 22, 23వ తేదీల్లో రిటైడ్ జడ్జ్ ఏ. ఆర్ముగస్వామి ముందు విచారణకు హాజరుకావడానికి డాక్టర్ శరవణ సిద్దం అయ్యారు.

English summary
The commission headed by retired judge A Arumughaswamy, set up to inquire into the death of late Chief Minister J Jayalalithaa, has summoned to DMK Dr. Saravanan to appear on November 22 and 23.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X