వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత ఫోటోలు బయటకొస్తే ఆత్మహత్య చేసుకుంటా!: శశికళ

దివంగత జయలలిత ఆసుపత్రిలో ఉన్న ఫోటోలు లేదా వీడియోలు బయటకు వస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ హెచ్చరించారని అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: దివంగత జయలలిత ఆసుపత్రిలో ఉన్న ఫోటోలు లేదా వీడియోలు బయటకు వస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ హెచ్చరించారని అంటున్నారు.

అక్రమాస్తుల కేసులో ఆమె పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. ఆమె జైలుకు వెళ్లడానికి ముందే పై వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. శశికళ హెచ్చరికలను ఆమె మేనల్లుడు జయానంద్ దినకరన్ వెల్లడించారు.

<strong>ఈ రోజు ఇది, రేపు మరొకటి: పన్నీరుసెల్వంపై శశికళ నిప్పులు </strong>ఈ రోజు ఇది, రేపు మరొకటి: పన్నీరుసెల్వంపై శశికళ నిప్పులు

జయ ఫోటోలు బయటకు వచ్చినా, ఆమె అంతిమ ఘడియల వ్యవహారం బయటకు పొక్కినా, దానిపై విచారణ జరిపినా తాను ఆత్మహత్య చేసుకుంటానని జైలుకు వెళ్లేముందు శశికళ కుటుంబ సభ్యులను హెచ్చరించారని అంటున్నారు.

నాటి లాగే..

నాటి లాగే..

తమిళనాడులో ప్రస్తుతం పన్నీరుసెల్వం వర్గం, పళనిస్వామి వర్గాల మధ్య విలీన చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. మూడు దశాబ్దాల క్రితం అన్నాడీఎంకే అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్ మృతి చెందినప్పుడు కూడా పార్టీ.. చీలిక ఇబ్బందులు ఎదుర్కొంది.

గెలుపు తర్వాత ఓటమి

గెలుపు తర్వాత ఓటమి

ఎంజీ రామచంద్రన్ మృతి అనంతరం విఎం జానకి, జయలలిత వర్గాలు ఏర్పడ్డాయి. దీంతో 1989లో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయాన్నిమూటగట్టుకుంది. అయితే, ఆ తర్వాత రెండు వర్గాలు విలీనం కావాలని నిర్ణయించుకున్నాయి. ఆ తర్వాత జరిగిన 1991 ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుంది.

రెండాకుల కోసం నాడు కూడా..

రెండాకుల కోసం నాడు కూడా..

నాడు జానకి, జయలలిత వర్గాలు కూడా ఇలాగే రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘం వరకు వెళ్లాయి. ఆ తర్వాత విలీనం అవుదామని నిర్ణయించుకున్న అనంతరం ఈసీకి ఇచ్చిన పరస్పర ఫిర్యాదులను ఉపసంహరించుకున్నారని చెబుతున్నారు.

ఇప్పుడు రెండాకులపై..

ఇప్పుడు రెండాకులపై..

ఇప్పుడు కూడా, పన్నీరుసెల్వం వర్గం, శశికళ వర్గం రెండాకుల గుర్తు కోసం ఈసీ వద్దకు వెళ్లాయి. ఆ తర్వాత విలీన చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శశికళ పార్టీ చీఫ్‌గా ఉండటాన్ని ప్రశ్నిస్తూ పన్నీరుసెల్వం వర్గం వేసిన పిటిషన్ ఆ వర్గం ఉపసంహరించుకుంటే ఈసీ ఆమోదిస్తుందని చెబుతున్నారు.

అయితే, పన్నీరు... పళనిస్వామితో మాత్రమే చర్చలకు మొగ్గు చూపుతున్నారు. ఇంకా చెప్పాలంటే పార్టీలో, ప్రభుత్వంలో శశికళ, దినకరన్‌ల పాత్ర ఏమాత్రం ఉండకూడదని గట్టిగా భావిస్తున్నారు. వారు బయటకు వెళ్తే.. ఇరువర్గాలు ఒక్కటయితే.. రెండాకుల గుర్తు కోసం పన్నీరు-పళని వర్గాలు మళ్లీ ఒక్కటిగా ఈసీ వద్దకు వెళ్లవచ్చును.

English summary
It is said that AIADMK chief Sasikala warned her relatives over Jayalalithaa's death mystery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X