వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ దెబ్బ: జయలలిత మృతి, ‘సీబీఐ, డీఓపీటీ’విచారణ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన తీరు అనుమానాస్పదంగా ఉందని ఆరోపిస్తూ అన్నాడీఎంకే పార్టీ బహిష్కరించిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది.

<strong>నెచ్చెలి శశికళతో జాగ్రత్త: బీజేపీ హై కమాండ్, లాభం కోసం!</strong>నెచ్చెలి శశికళతో జాగ్రత్త: బీజేపీ హై కమాండ్, లాభం కోసం!

జయలలిత అనుమానాస్పదంగా మృతి చెందారని, సీబీఐ విచారణ జరిపించాలని శశికళ పుష్ప కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. రాజ్యసభ సభ్యురాలు రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

Jayalalithaa death: Union home ministry forwards Rajya Sabha member Sasikala Pushpa’s letter seeking CBI probe to DOPT

సీబీఐకి సంబంధించిన వ్యవహారాలు చూసే డిపార్ట్ మెంట్ ఆఫ్ పెర్సనెల్ అండ్ ట్రైనింగ్ ( సిబ్బంది వ్యవహారాల శాఖ)కు జయలలిత అనుమానాస్ప మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని వచ్చిన లేఖను అప్పగించారు.

<strong>అన్నాడీఎంకేలో అసమ్మతి చిచ్చు: దొరైస్వామి, మాజీ స్పీకర్ దెబ్బ</strong>అన్నాడీఎంకేలో అసమ్మతి చిచ్చు: దొరైస్వామి, మాజీ స్పీకర్ దెబ్బ

దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రటరీ మణిరాం ఒక మెమొరాండం విడుదల చేశారు. ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అనే విషయం రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పకు తెలియజేయాల్సిందిగా కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు.

English summary
In an official communication, Mani Ram, an undersecretary of the ministry of home affairs, has requested the department of personnel and training take appropriate action on the matter as it concerns the DOPT, which is the administrative authority of the CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X