వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళకు కోర్టు కేసే అడ్డంకి, గవర్నర్ నిర్ణయంలో జాప్యం?

రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య లేదని రాజ్ భవన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ నిందితురాలుగా ఉన్నందున ఈ కేసే ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు అడ్డంకిగా మారిందనే అభిప్రాయాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమె రెండవ నిందితుడిగా ఉండడమే అడ్డంకిగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.మరో వైపు రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు లేవని రాజ్ భవన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.మరో వైపు జయలలిత అక్రమాస్తుల కేసుపై సోమవారం వచ్చే అవకాశం లేదు. మంగళవారం నాడు లేదా తర్వాత ఈ కేసుపై తీర్పు వచ్చే అవకాశం ఉంది.

గురువారం మధ్యాహ్నం చెన్నైకు గవర్నర్ విద్యాసాగర్ రావు వచ్చారు.అయితే గురువారం సాయంత్రం పూట అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అదే రోజు రాత్రి అన్నాడిఎంకె చీఫ్ శశికళ గవర్నర్ విద్యాసాగర్ రావుతో సమావేశమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు.

sasikala

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కూడ గవర్నర్ ఆరాతీశారు.ఈ పరిస్థితుల్లో ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై గవర్నర్ న్యాయనిపుణులతో కూడ సంప్రదింపులు జరుపుతున్నారు.శాంతి భద్రతల పరిస్థితి, ఎంఏల్ఏలకు ఉన్న భద్రత విషయాలపై కూడ గవర్నర్ ఆరా తీశారు.

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ అన్ని కోణాల్లో చర్చించారు.న్యాయనిపుణులతో పాటు అన్ని రకాల అవకాశాలను ఆయన పరిశీలించారు.ఈ తరహ పరిస్థితులు ఏనాడు కూడ తమిళనాడులో చోటుచేసుకోలేదని రాజ్ భవన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అయితే తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ సంకట స్థితిలో ఉన్నారు. అన్నాడిఎంకె శాసనసభ పక్ష నాయకురాలిగా శశికళ ఎన్నికయ్యారు.అయితే అపద్దర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ఉన్నారు.

జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.మరో వైపు జయలలిత అక్రమాస్తుల కేసు తీర్పు సోమవారం నాడు కూడ వచ్చే అవకాశం లేదని సమాచారం.అయితే మంగళవారం నాడే ఈ కేసుపై తీర్పు వచ్చే అవకాశం ఉంది.ఒకవేళ మంగళవారం నాడు లేదా ఈ కేసుపై తీర్పు వచ్చే అవకాశం ఉందని
సమాచారం.

కేసులే శశికళకు అడ్డంకి

రాజ్యాంగంలోని 164(4) ప్రకారంగా శాసనసభ్యుడు కాకపోయినా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వెసులుబాటు ఉంది.అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే వారు ఆరుమాసాల్లో ఎంఏల్ఏగా ఎన్నిక అవుతారనే నమ్మకం గవర్నర్ కు కలగాలి.

ఈ సాంకేతిక సమస్యే శశికళను ముఖ్యమంత్రి పదవి చేపట్టకుండా అడ్డుకొంటుందనే న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత తర్వాత శశికళే ఎ..2 గా ఉన్నారు.ఈ కేసుపై తీర్పు వచ్చే వారం వెలువడే అవకాశం ఉంది.

ఈ కేసులో శశికళకు శిక్ష పడితే ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగాల్సిన పరిస్థితి ఉంటుంది.అంతేకాదు ఆమె శాసనసభకు పోటీచేసే అర్హతను కూడ కోల్పోతారు.

వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొనే శశికళకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకుండా వేచిచూసే ధోరణిలో గవర్నర్ ఉన్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న యథాతథ స్థితిని గవర్నర్ కొనసాగించే అవకాశాలు లేకపోలేదనే న్యాయనిపుణులు చెబుతున్నారు.అయితే ఇంకా ఏ విషయాలను రాజ్ భవన్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

English summary
The verdict in Jayalalithaa disproportionate assets case is unlikelyto be pronounced on Monday as well. Justice Amitava Roy is not sittingon Monday. This means the verdict could be pronounced only on Tuesdayor a later date.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X