వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ, దినకరన్ లపై వేటు.. ఆ పదవి ఎప్పటికీ జయలలితదే, ఇక పార్టీ బాధ్యతలు పన్నీర్, పళనిస్వామివే!

అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లిన చిన్నమ్మ శశికళను తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా తొలగించారు. ఈ మేరకు మంగళవారం జరిగిన అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

Jayalalithaa 'Eternal General Secretary',Sasikala Removed ఆ పదవి ఎప్పటికీ జయలలితదే | Oneindia Telugu

చెన్నై: అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న 'చిన్నమ్మ' శశికళను తాజాగా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా తొలగించారు. ఈ మేరకు మంగళవారం జరిగిన అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.

సమావేశం అనంతరం తమిళనాడు మంత్రి ఉదయ్‌కుమార్‌ తీర్మానాన్ని చదివి వినిపించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి 'అమ్మ' జయలలిత మరణానంతరం పార్టీలో చక్రం తిప్పాలని భావించిన 'చిన్నమ్మ' శశికళకు ఆరంభం నుంచే అడ్డంకులు ఎదురయ్యాయి.

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి ఎప్పటికీ జయలలితదేనని తీర్మానించి.. ఆ బాధ్యతలను తాత్కాలికంగా చేపట్టిన శశికళను పదవి నుంచి తొలగిస్తూ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. పార్టీ చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా పన్నీర్‌ సెల్వం, అసిస్టెంట్‌ చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా పళనిస్వామి ఉంటారని కార్యవర్గం పేర్కొంది.

ప్రధాన కార్యదర్శికి ఉండే అధికారాలన్నీ చీఫ్‌ కో ఆర్డినేటర్‌, అసిస్టెంట్‌ చీఫ్‌ కో ఆర్డినేటర్లకు ఉంటాయని సమావేశంలో తీర్మానించారు. జయలలిత నియమించిన ఆఫీస్‌ సిబ్బందిని అలాగే కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది.

శశికళ మేనల్లుడు దినకరన్‌ చేసిన ప్రకటనలు, ఆయన చేపట్టిన నియామకాలను పార్టీ ఆమోదించబోదని పేర్కొంది. ఇక రెండాకుల గుర్తు కూడా తమకే చెందుతుందని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం 'చిన్నమ్మ' శశికళ పార్టీ పగ్గాలు చేపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే అమ్మ మరణం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పార్టీ రెండుగా చీలిపోయింది.ఈ క్రమంలో అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకెళ్లారు. దీంతో ఆమె మేనల్లుడు దినకరన్‌కు అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.

ఇటీవలే పార్టీలోని పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం వర్గాలు ఏకమయ్యాయి. అయితే శశికళ, ఆమె కుటుంబాన్ని పార్టీ నుంచి దూరంగా ఉంచాలన్న పన్నీర్‌ సెల్వం ప్రధాన డిమాండ్‌పై అంగీకారం కుదరడంతో ఈ విలీనం జరిగిన విషయం తెలిసిందే. దీంతో నేడు సర్వసభ్య సమావేశం ఏర్పాటుచేసి.. శశికళను పదవి నుంచి తొలగించారు.

English summary
The AIADMK (Amma, Puratchi Thalaivi Amma) on Tuesday resolved to oust party general secretary V K Sasikala + from the post and set up a steering committee to lead the party. The party general council passed 12 resolutions at a meeting held in Vanagaram on the outskirts of Chennai. The high-level body led by party presidium chairman E Madhusoodanan resolved to do away the post of general secretary. "Appointment of Sasikala is cancelled. All her activities between December 30 and February 15, including appointments, sackings and inclusions are invalid," said a resolution. The resolution was read out by Rajya Sabha member R Vaithilingam and seconded by all general council members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X