వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్తుల కేసుతో జయలలితకు ఒత్తిడి,బాత్‌రూమ్‌లో కిందపడ్డారు: శశికళ, ఆ రోజు ఏమైందంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:ఆసుపత్రికి వెళ్ళేందుకు దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిరాకరించారని జయలలిత సన్నిహితురాలు శశికళ చెప్పారు. జయలలిత మరణంపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ముందు జయలలిత ఆసుపత్రిలో చేరడానికి కారణాలను ఆమె వివరించారు. స్ఫృహ కోల్పోయిన తర్వాతే ఆసుపత్రికి జయలలితను తరలించినట్టు శశికళ వివరించారు.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్‌ ముందు జయలలిత సన్నిహితురాలు శశికళ హజరై ఆసుపత్రిలో చేరడానికి గల కారణాలను వివరించారు ఏ పరిస్థితుల్లో జయలలితను ఆసుపత్రిలో చేర్చామనే విషయమై ఆమెకు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను ఆసుపత్రిలో చేర్చిన రోజు ఏం జరిగిందో ఆమె సన్నిహితురాలైనా శశికళ విచారణ కమిషన్‌కు చెప్పారు. తీవ్ర జ్వరంతో ఉన్న జయలలితను ఆసుప్రతికి రావాలని వైద్యులు సూచించినా ఆమె నిరాకరించారని తెలిపారు. రాత్రి సమయంలో ఆమె స్పృహ కోల్పోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు చెప్పారు.

బాత్‌రూమ్‌లో కిందపడిన జయ

బాత్‌రూమ్‌లో కిందపడిన జయ

జయలలిత ఆసుపత్రిలో చేరడానికి ముందు చోటు చేసుకొన్న పరిణామాలను ఆమె సన్నిహితురాలు శశికళ వివరించారు. 2016 సెప్టెబంర్ 22న రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో జయలలిత బ్రష్ చేసుకొనేందుకు వాష్‌రూమ్‌కు వెళ్ళారని శశికళ గుర్తు చేశారు. అయితే బాత్‌రూమ్‌లోనే ఆమె కిందపడిపోయిందని శశికళ చెప్పారు.అప్పటికే తీవ్ర జ్వరంగా ఉందన్నారు. అయితే జ్వరంగా ఉన్న సమయంలో కిందపడిన తర్వాత సహయం కోసం తనను పిలిచారని శశికళ విచారణ కమిషన్‌కు వివరించినట్టు సమాచారం.

 జయలలిత స్పృహ కోల్పోయారు

జయలలిత స్పృహ కోల్పోయారు

బాత్‌రూమ్ ‌నుండి ఆమెను బయటకు తీసుకొని వచ్చినట్టు శశికళ విచారణ కమిషన్ ముందు చెప్పారు. అయితే బెడ్ మీద పడుకోబెట్టిన కొద్దిసేపటికే ఆమె స్పృహ కోల్పోయారని శశికళ చెప్పారు. దీంతో తన బంధువైన డాక్టర్‌ శివకుమార్‌కు తాను పోన్ చేసినట్టు ఆమె చెప్పారు. అతను వచ్చి జయలలితను పరీక్షించారని ఆమె గుర్తు చేసుకొన్నారు. ఆ తర్వాత ఆపోలో ఆసుపత్రి వైస్ చైర్ పర్సన్ ప్రీతా రెడ్డి భర్త విజయ్‌కుమార్ రెడ్డికి పోన్ చేసి అంబులెన్స్‌ను పంపించాలని కోరినట్టు శశికళ విచారణ కమిషన్ ముందు వెల్లడించారని తెలిసింది.

ఆసుపత్రిలోకి వెళ్తోంటే జయకు స్ఫృహ

ఆసుపత్రిలోకి వెళ్తోంటే జయకు స్ఫృహ

అపోలో ఆసుపత్రి నుండి రెండు అంబులెన్స్‌లు వచ్చాయని శశికళ విచారణ కమిషన్ ముందు ప్రకటించారు. అయితే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో జయలలితకు స్పృహలోకి వచ్చిందని శశికళ గుర్తు చేసుకొన్నారు. ఎక్కడికి వెళ్తున్నామని జయ ప్రశ్నించారని శశికళ చెప్పారు. ఆసుపత్రికి వెళ్తున్నట్టు శశికళ చెప్పారు. మరో వైపు ఆ రోజు ఉదయం జయలలితను రెండు సార్లు డాక్టర్ శివకుమార్ పరీక్షించారని శశికళ చెప్పారు. జ్వరంతో బాధపడుతున్న జయను ఆసుపత్రికి రావాలని డాక్టర్ శివకుమార్ సూచించినా ఆమె వినలేదన్నారు.

అక్రమాస్తుల కేసుతో ఒత్తిడి

అక్రమాస్తుల కేసుతో ఒత్తిడి

అక్రమాస్తుల కేసుతో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర ఒత్తిడికి గురయ్యారని శశికళ విచారణ కమిషన్‌ ముందు చెప్పారని సమాచారం. ఈ ఒత్తిడి కారణంగానే ఆమె ఆరోగ్యం క్షీణించిందని శశికళ గుర్తు చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో జయకు షుగర్ లెవల్స్ బాగా తగ్గిపోయాయని ఆమె గుర్తు చేశారు. సెప్టెంబర్ 19న మరోసారి ఆమెకు జ్వరం వచ్చిందని శశికల విచారణ కమిషన్ ఎదుట చెప్పారు.

జయను గవర్నర్ చూశారు

జయను గవర్నర్ చూశారు

ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను అప్పటి ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు పరామర్శించారని శశికళ విచారణ కమిషన్ ముందు చెప్పారు గవర్నర్ చూసి జయలలిత చేయి ఎత్తారని గవర్నర్ విద్యాసాగర్ రావు తనకు చెప్పారని ఆమె గుర్తు చేసుకొన్నారు.2016 అక్టోబర్ 22న గవర్నర్ విద్యాసాగర్ రావు జయను పరామర్శించారని ఆమె చెప్పారు. మరో వైపు 2016 సెప్టెంబరు 22-27 మధ్య పన్నీర్‌సెల్వం, తంబిదురై, విజయ భాస్కర్‌‌లు జయలలితను చూశారని శశికళ విచారణ కమిషన్ ముందు చెప్పారు.

జయ వీడియోలు కమిషన్‌కు ఇచ్చా

జయ వీడియోలు కమిషన్‌కు ఇచ్చా

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో నాలుగు వీడియోలు రికార్డు చేసినట్టు శశికళ గుర్తు చేశారు. జయ అనుమతితోనే ఈ వీడియోలను రికార్డు చేసినట్టు శశికళ చెప్పారు. అయితే ఈ వీడియోలను విచారణ కమిషన్ ‌కు శశికళ సమర్పించారు.

English summary
J Jayalalithaa had refused to go to hospital after she collapsed in the washroom of her Chennai home on September 22, 2016, her long-time companion VK Sasikala has told a retired judge investigating the death of the former Tamil Nadu chief minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X