వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత ఆత్మ ‘ప్రేతాత్మ’అయ్యి తిరుగుతుందంట !

వైష్ణవ సాంప్రధాయం ప్రకారం అంత్యక్రియలు చెయ్యకుంటే అలాంటి వారి ఆత్మశాంతించదని, ప్రేతాత్మగా అక్కడక్కడే తిరుగుతుంటుందని అన్నారు.

|
Google Oneindia TeluguNews

మేలుకోటే/బెంగళూరు: మండ్య జిల్లా పాండవపుర తాలుకాలోని ప్రసిద్ధి చెందిన మేలుకోటే పుణ్యక్షేత్రంలో శ్రీ వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు జరిగిన తీరుపై పలువురు బ్రాహ్మాణులు మండిపడుతున్నారు.

జయలలిత అంత్యక్రియలు చేసిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేలుకోటేలోని వైష్ణవ బ్రాహ్మాణ కుటుంబంలో జన్మించిన సంపిగే శ్రీనివాస్ (అయ్యంగార్) ఒన్ ఇండియాకు ఓ వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో ఆయన ఈ విధంగా వివరించారు.

మేలుకోటేలోని వైష్ణవ కుటుంబంలో జన్మించిన జయలలిత తమిళ సినీ రంగంలో తిరుగులేని తారగా ఖ్యాతి సంపాధించారని గుర్తు చేశారు. తరువాత అన్నాడీఎంకే పార్టీలో అంచలంచెలుగా ఎదిగి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు.

Jayalalithaa: It is pity that former CM of Tamil Nadu, Sampige Srinivas says

తాను జన్మించిన మండ్య జిల్లాలోని ప్రజలకు కావేరీ నీటి విషయంలో అనేక సమస్యలు సృష్టించిన జయలలిత తనను నమ్మకున్న తమిళ ప్రజలకు న్యాయం చెయ్యడానికి ప్రయత్నించారని ఇదే సమయంలో గుర్తు చేశారు.

అలాంటి జయలలిత మరణించిన తరువాత ఆమె అంత్యక్రియలు సాంప్రధాయానికి వ్యతికేరంగా చెయ్యడంతో వైష్ణవ బ్రాహ్మాణులు షాక్ కు గురైనారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇలా ఎందుకు చేశారు ? అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

బ్రాహ్మాణ సాంప్రధాయం ప్రకారం జయలలిత భౌతికకాయాన్ని చితిపేర్చి నిప్పంటించి అంత్యక్రియలు పూర్తి చెయ్యాలని అన్నారు. అలా కాకుండా ద్రవిడ, క్రైస్తవ సాంప్రధాయం ప్రకారం పెట్లెలో పెట్టి భూమిలో పాతి పెట్టడంతో బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు.

వైష్ణవ సాంప్రధాయం ప్రకారం అంత్యక్రియలు చెయ్యకుంటే అలాంటి వారి ఆత్మశాంతించదని, ప్రేతాత్మగా అక్కడక్కడే తిరుగుతుంటుందని అన్నారు. ప్రస్తుతం జయలలిత ఆత్మశాంతించదని, ఆమె ఆత్మ ప్రేతాత్మగా అక్కడక్కడే తిరుగుతుంటుందని, ఇది వైష్ణవ బ్రాహ్మాణుల నమ్మకం అని సంపిగే శ్రీనివాస్ చెబుతున్నారు.

జయలలిత బ్రతికి ఉన్న సమయంలో ఆమె అమ్మా అమ్మా అంటూ ఆప్యాయంగా పిలుచుకున్న తమిళనాడు ప్రజలు ఆమె మరణించిన తరువాత బ్రాహ్మాణ సాంప్రధాయం ప్రకారం ఎందుకు అంత్యక్రియులు చెయ్యలేదు ? అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ద్రవిడుల పద్దతి ప్రకారం జయలలిత అంత్యక్రియలు నిర్వహించి తమిళనాడులోని బ్రాహ్మాణుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నించారని, అలా ఇక ముందు జరకుండా అక్కడి బ్రాహ్మాణలు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని సంపిగే శ్రీనివాస్ తన వ్యాసంలో వివరించారు.

English summary
It is pity that former chief minister of Tamil Nadu and popular leader Jayalalithaa was buried at Marina beach though she is from Iyengar brahmin family from Mandya. Sampige Srinivas says that she should have been cremated as per brahmin custom.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X