వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

206 ఆలయాల్లో నిత్యాన్నదానం: జయలలిత

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జే. జయలలిత ఆ రాష్ట్రంలో మరో కొత్త పథకం ప్రవేశపెట్టారు. తమిళనాడులోని ప్రసిద్ధి చెందిన 206 దేవాలయాలలో నిత్యాన్నదాన పథకం ప్రవేశ పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

అదే విధంగా 10 వేలకు పైగా ఉన్న చిన్న చిన్న దేవాలయాలలో ఈ పథకం అమలులోకి తీసుకు వచ్చారు. రూ. 2.24 కోట్ల విలువైన పూజా సామాగ్రిని దేవాలయాలకు అందించారు. ఇప్పటికే తమిళనాడులో ని ప్రసిద్ధి చెందిన దేవాలయాల పూర్తి రక్షణకు అనేక చర్యలు తీసుకున్నారు.

Jayalalithaa launched the Annadhanam scheme in 206 more temples

ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్న జయలలిత ఆ జాబితాలోకి నిత్యాన్నదానం పథకం చేర్చారు. అదే విధంగా 820 మంది రోజువారి కార్మికులకు ఈ అన్నదాన పథకంలో భాగంగా వేతనాలు చెల్లించడానికి చర్యలు తీసుకున్నారు.

వినాయక చవితి పండుగ సందర్బంగా నాలుగు దేవాలయాలకు పూజా సామాగ్రి, ఇద్దరు రోజువారి కార్మికులకు వేతనాలు అందించిన కుమారి జయలలిత ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. 2002లో శ్రీ కబాలేశ్వర దేవాలయంలో నిత్య అన్నదానం ప్రారంభించారు. ప్రస్తుతం 500కు పైగా ఉన్న ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో అన్నదాన పథకం అమలు చేస్తున్నారు.

English summary
Tamil Nadu Chief Minister Jayalalithaa launched the Annadhanam scheme in 206 more temples in the State and distribution of pooja articles worth Rs.2.44 Crore to 10,000 tiny shrines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X