వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభిమానులు ఏ చర్యలకు పాల్పడొద్దు, సంచలనం రేపుతున్న జయలలిత ఫోటో

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పైన ఎలాంటి ఆందోళన అవసరం లేదని, అభిమానులు ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని ఆ పార్టీ నాయకులు సరస్వతి ఆదివారం నాడు సూచించారు.

అమ్మ ఆరోగ్యం పైన ఎవరు కూడా దుష్ప్రచారం చేయవద్దన్నారు. జయ ఆరోగ్యంపై వైద్యులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని చెప్పారు. జయలలిద వల్లే కావేరీ జలాలు తమిళనాడుకు వస్తున్నాయన్నారు. కావేరీ జలాల పైన కర్నాటక ప్రత్యేక అసెంబ్లీ సరికాదన్నారు.

అమ్మకు దిష్టిపోవాలని తాము ఇక్కడే (అపోలో ఆసుపత్రి మెయిన్ గేటు వద్ద) పూజలు చేస్తున్నామన్నారు. అమ్మ ఆరోగ్యం పైన గవర్నర్ విద్యాసాగర రావు ప్రకటన చేయడంతో మరింత ధైర్యం పెరిగిందన్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని చెప్పారు.

Jayalalithaa

సంచలనం సృష్టిస్తున్న అమ్మ ఫోటో

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై పుకార్లు కొనసాగుతున్నాయి. ఆగడం లేదు. సోషల్ మీడియాలో జయ ఆరోగ్యంపై పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే అమ్మకు సంబంధించిన ఒక ఫొటో వైరల్‌గా మారింది.

జయలలిత ఆసుపత్రి బెడ్ పైన ఆక్సిజన్‌ మాస్క్‌ పెట్టుకుని చికిత్స తీసుకుంటున్నట్లు ఉన్న ఫొటో ఒకటి నెట్లో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆ ఫొటోను అనేకమంది షేర్‌ చేస్తున్నారు.

అయితే ఆ ఫొటో ఇప్పటిది కాదని. అమ్మ ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని, కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఫోటో ఏడేళ్ల క్రితం పెరూలోని ఎస్‌స్లాడ్‌ ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నప్పటిదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పైన ఎలాంటి ఆందోళన అవసరం లేదని, అభిమానులు ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని ఆ పార్టీ నాయకులు సరస్వతి ఆదివారం నాడు సూచించారు.

English summary
Jayalalithaa Recovering Well, Is In Charge, Says Party Amid Health Concerns.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X