వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయకు 750 జతల స్లిప్పర్లు, 10,500 చీరెలు: 4గురు పోలీసుల కాపలా

జయలలితకు చెందిన 750 జతల స్లిప్పర్లకు, 10,500 చీరెలకు నలుగురు పోలీసులు 24 గంటలు కాపలా కాస్తున్నారు. అక్రమాస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న వాటికి నలుగురు పోలీసులతో భద్రత కల్పించారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన 750 జతల స్పిప్పర్లకు, 10,500 చీరెలకు నలుగురు పోలీసులు 24 గంటలు కాపలా కాస్తున్నారు. అక్రమాస్తుల కేసులో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

వాటిని తిరిగి ఇస్తారా, ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంటుందా అనేది సుప్రీంకోర్టు తీర్పును బట్టి ఉంటుంది. జయలలిత, శశికళ, ఇలవరసి, సుధాకరన్ నిందితులుగా ఉన్న అక్రమాస్తుల కేసులో విచారణ పూర్తయి సుప్రీంకోర్టులో తీర్పు పెండింగులో ఉంది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో జయలలిత అక్రమాస్తుల కేసు కర్ణాటకకు బదిలీ అయింది. ఈ సమయంలో స్వాధీనం చేసుకున్న ఆస్తులను, వస్తువులను కర్ణాటకకు తరలించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు సిటీ సివిల్ కోర్టులోని మొదటి అంతస్తులో గల గదిలో ఉంటాయి.

Jayalalithaa's 750 pairs of slippers, 10,500 sarees guarded by 4cops at Bengaluru

ఒన్ ఇండియా ప్రతినిధి 2005లో సందర్శించినప్పుడు అందులో ఏమున్నాయో తమకు తెలియదని పోలీసులు చెప్పారు. కాపలా ఉన్న పోలీసులు తమకు అవేమిటో తెలియదన్నారు. కానీ వాటిలో ఏముందో ప్రస్తుతం బయటపడింది.

వాటిలో జయలలితకు చెందిన 750 జతల స్లిప్పర్లు, 10,500 చీరెలున్నట్లు తేలింది. చాలా వరకు సిల్క్ చీరెలు, బంగారం పూత పోసిన చీరెలున్నాయి. రూ.3.5 కోట్ల విలువ చేసే బంగారం ఉన్నట్లు చెబుతున్నారు.

English summary
There are four cops who are on duty 24/7 in Bengaluru guarding 750 pairs of footwear that belonged to J Jayalalithaa. The 750 pairs of footwear had been seized in connection with the disproportionate assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X