చిక్కుల్లో అమ్మ క్యాంటీన్లు: రూ. 120 కోట్లు నష్టం, పట్టించుకోని ?

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత ప్రీతిపాత్రమైన అమ్మ క్యాంటీన్లు ఆర్థిక ఒడిదుడుకులతో అవస్థలు పడుతున్నాయి. ఏడాదికి రూ. 120 కోట్ల ఆర్థిక భారంతో అమ్మ క్యాంటీన్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

పేద, బడుగు, బలహీన వర్గాల ఆకలి తీర్చేందుకు జయలలిత 2013లో అమ్మ క్యాంటీన్లను ప్రవేశపెట్టారు. మొదట చెన్నై నగరంలో 15 క్యాంటీన్లను జయలలిత స్వయంగా ప్రారంభించగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ వచ్చింది.

తరువాత చెన్నై నగరంలో వార్డుకు ఒకటి చొప్పున 200 అమ్మ క్యాంటీన్లు పెంచారు. తరువాత క్రమేనా తమిళనాడు రాష్ట్రం అంతా విస్తరించారు. అమ్మ క్యాంటీన్లు దేశంలోని అనేక రాష్ట్రాలను ఆకర్షించింది.

మొత్తం 40 క్యాంటీన్లు

మొత్తం 40 క్యాంటీన్లు

2016 సెప్టెంబర్ 24వ తేదిన మంత్రి తంగమణి మరో 107 క్యాంటీన్లను కొత్తగా ప్రారంభించారు. ఇప్పుడు తమిళనాడులో మొత్తం 407 అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి. జయలలిత అంత్యక్రియల రోజు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన వారికి అమ్మ క్యాంటీన్లు ఉచితంగా ఆహారాన్ని వడ్డించాయి.

అమ్మ అభిమానులకు ఉచితంగా

అమ్మ అభిమానులకు ఉచితంగా

జయలలిత సమాధిని చూడటానికి వచ్చిన వారికి మూడు రోజుల పాటు మూడుపూటల ఉచితంగా అన్నం పెట్టారు. అమ్మ క్యాంటీన్లను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు ఇంటలిజెన్స్ అధికారులు రహస్య విచారణ చేపట్టడంతో షాక్ కు గురైయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయని సమాచారం.

అమ్మ జయలలిత లేని లోటు

అమ్మ జయలలిత లేని లోటు

ఇటీవల అమ్మ క్యాంటీన్లలో ఆహారంలోని నాణత్య క్రమేణా తగ్గిపోవడం ప్రారంభం అయ్యిందని ఆరోపణలు వచ్చాయి. జయలలిత మరణం, అమ్మ క్యాంటీన్లను పర్యవేక్షించే అధికారుల రిటైడ్ మెంట్ దగ్గర పడటంతో పట్టించుకునే వారు కరువయ్యారని సమాచారం.

రాజకీయ పరిణామాలు

రాజకీయ పరిణామాలు

రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు అమ్మ క్యాంటీన్లపై పెద్ద ప్రభావం చూపించింది. అహారంలో నాణ్యతో లోపించడంతో ప్రజలు విముఖ ప్రదర్శించడం ప్రారంభం కావడంతో వండిన వంటకాలు అలాగే నిలిచిపోతున్నాయి.

పరిశుభ్రత, ఆహార నాణ్యత ?

పరిశుభ్రత, ఆహార నాణ్యత ?

అమ్మ క్యాంటీన్ల పరిశుభ్రత, ఆహార నాణ్యత, ఎంత వండుతున్నారు, ఎంత అమ్ముతున్నారు అనే విషయాలను అధికారులు, ప్రభుత్వం గాలికివదిలేసిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈదెబ్బతో పలు ప్రాంతాల్లోని అమ్మ క్యాంటీన్లు మూసివేసే పరిస్థితికి చేరుకున్నాయని తెలిసింది.

రూ. 120 కోట్ల నష్టం వస్తుందా ?

రూ. 120 కోట్ల నష్టం వస్తుందా ?

ఒక అమ్మ క్యాంటీన్ నిర్వహణకు నెలకు రూ. 3 లక్షలు ఖర్చు అవుతుంది, ఈ లెక్కన రాష్ట్రంలోని 407 క్యాంటీన్లకు ఏడాదికి రూ. 120 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ఈ రూ. 120 కోట్లు భారం కార్పొరేషన్ కు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎంకే స్టాలిన్, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్

ఎంకే స్టాలిన్, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్

తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఎంకే స్టాలిన్, కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ సైతం అమ్మ క్యాంటిన్లలో ఆహారం ఆరగించారు. అమ్మ క్యాంటీన్లలో ఆహార నాణత్యను తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థి ఎదురుకావడంతో ప్రజలు మండిపడుతున్నారు.

పట్టించుకోండి

పట్టించుకోండి

మొత్తం మీద జయలలిత మరణించి 38 రోజులు పూర్తి కాకముందే ఆమె ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లు చిక్కుల్లో పడ్డాయని తమిళ సోదరులు అంటున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం జోక్యం చేసుకుని అమ్మ క్యాంటిన్లను సక్రమంగా నిర్వహించాలని మనవి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+