చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయ మృతికి అసలు కారణం ఇదే: వివరించిన అపోలో చైర్మన్

జయలలితకు గుండెపోటు వచ్చిన తరువాత గోల్డెన్ అవర్ గా పరిగణించే ఆ సమయంలో ఆమెకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య చికిత్సలు అందించామ.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతికి అసలు కారణం ఏమిటీ అనే విషయంపై అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి క్లారిటీ ఇచ్చారు. జయలలితకు గుండెపోటు వస్తుందని తామెవరూ ఊహించలేకపోయామని ప్రతాప్ సి. రెడ్డి అన్నారు.

ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ విషయాలు మొత్తం వెల్లడించారు. జయలలిత ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఒకటి రెండు రోజులు మినహా అమెకు అందిస్తున్న చికిత్సలన్నింటిని తానే దగ్గురుండి పరిశీలించానని స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 22న జయలలిత ఆసుపత్రిలో చేరారని, అప్పటి నుంచి ఆమె చికిత్సకు బాగా స్పందించారని, ప్రతి రోజు తనను చూసినప్పుడల్లా చిరునవ్వుతో పలకరించేవారని ప్రతాప్ సి. రెడ్డి అన్నారు.

జయలలిత చికిత్సకు సహకరిస్తున్న విషయం గుర్తించి తాను ఎంతో ఆశ్చర్యపోయానని చెప్పారు. జయలలిత తను తలచిన కార్యాన్ని కచ్చితంగా నిర్వర్తించగల సత్తా ఆమెకు మాత్రమే ఉందని ప్రతాప్ సి. రెడ్డి వివరించారు.

పన్నీరు సెల్వం పదవి ఎసరు ? ఢిల్లీకి పరుగో పరుగు

అపోలో ఆసుపత్రి తాను ప్రారంభించక ముందు హెచ్ఎం ఆసుపత్రిలో పని చేస్తున్నానని ప్రతాప్ సి. రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఓ సారి జయలలిత చికిత్స కోసం తన దగ్గరకు వచ్చారని. అస్వస్థతతో ఉన్నా ఆ సమయంలో జయలలిత ముఖంలో చిరునవ్వు కనిపించిందని వివరించారు.

ఆ తరువాత జయలలిత ముఖ్యమంత్రి అయ్యి పదవిలో ఉన్నప్పుడు అనేక సార్లు తాను ఆమెను కలిశానని, తనను ఎప్పుడు చూసినా చిరునవ్వుతోనే స్వాగతం పలికేవారని చెప్పారు. జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి చికిత్సలన్నింటిని తాను దగ్గరుండి పరిశీలించానని ప్రతాప్ సి. రెడ్డి చెప్పారు.

Jayalalithaa’s death: Apollo Hospitals Chairman Pratap C Reddy said !

తాను రెండు నెలల పాటు చెన్నై నగరం విడిచిపెట్టలేదని అన్నారు. తమ శక్తికి మించి జయలలితకు చికిత్స చేశామని తెలిపారు. జయలలలిత మరణించక ముందు అత్యవసర పరిస్థితిలో తాను హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చిందని ప్రతాప్ సి. రెడ్డి అన్నారు.

హైదరాబాద్ బయలుదేరక ముందే తాను జయలలిత దగ్గరకు వెళ్లి పలకరించానని, ఆ సమయంలో ఆమె టీవీ చూస్తున్నారని, నేను ఆమె దగ్గరకు వెళ్లి నేను హైదరాబాద్ వెళ్లి తిరిగి వచ్చేలోపు మీరు లేచి నడుస్తారని చెప్పానని గుర్తు చేశారు.

హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన తరువాత జయలలితను డిశ్చార్జ్ చెయ్యాలని తాము అనుకున్నామని, చెన్నై తిరిగి వచ్చిన తరువాత ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకుందామని అనుకుని తాను హైదరాబాద్ వెళ్లిపోయానని అన్నారు.

శశికళకు హై కోర్టు నోటీసులు: పదవికి అర్హత ఉందా ? ఎందుకంటే !

హైదరాబాద్ నుంచి తాను చెన్నై తిరిగి వచ్చిన తరువాత జయలలితకు గుండెపోటు వచ్చిందని తెలుసుకుని దిగ్భ్రాంతికి గురైనానని అపోలో చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి చెప్పారు. హృద్రోగశస్త్ర చికిత్స నిపుణుడొకరు జయలలితను నిరంతరం పరిశీలిస్తున్న సమయంలోనే గుండెపోటు వచ్చిందని ప్రతాప్ సి. రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

అప్పటి వరకు జయలలితకు గుండెపోటు వచ్చేందుకు ఎలాంటి అనవాళ్లు అగుపడలేదని, విషయం తెలుసుకుని ఆవేదన చెందానని ప్రతాప్ సి. రెడ్డి చెప్పారు. జయలలితకు గుండెపోటు వచ్చిన వెంటనే ప్రత్యేక వైద్య నిపుణలు వైద్య చికిత్సలు ప్రారంభించారని అన్నారు.

గోల్డెన్ అవర్ గా పరిగణించే ఆ సమయంలో జయలలితకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య చికిత్సలు అందించామని, ఆమె చికిత్స పొందుతున్న గదిలోనే ఎక్మో విభాగపు గది కూడా ఉందని అన్నారు.

Jayalalithaa’s death: Apollo Hospitals Chairman Pratap C Reddy said !

వెంటనే జయలలితకు ఎక్మో పరికరం అమర్చామని వివరించారు. ఎక్మో చికిత్స చేసుకున్న అనేక మంది ప్రాణగండం నుంచి బయటపడిన సందర్బాలు ఎన్నో ఉన్నాయని, అయితే దురదృష్టవశాత్తు జయలలిత విషయంలో అది సాధ్యం కాలేకపోయిందని ప్రతాప్ సి. రెడ్డి వివరించారు.

జయలలిత ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి చికిత్సకు పూర్తిగా సహకరించారని, అనారోగ్యం సృష్టించిన బాధలన్నింటిని తట్టుకుని ధైర్యంగా ఉన్నారని ప్రతాప్ సి. రెడ్డి గుర్తు చేసుకున్నారు.

జయలలిత కోపంలోనూ ఓ న్యాయం దాగి ఉందని, అన్నాడీఎంకే పార్టీలోనే కాదు సామాన్య ప్రజానీకం మదిలోనూ ఆమె సుస్థిరస్థానం సంపాదించుకున్నారని, అలాంటి ధైర్యశాలిని తాను ఇంత వరకు చూడలేదని అపోలో ఆసుప్రతి చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో జయలలితను కీర్తించారు.

English summary
Jayalalithaa was rushed to the hospital on 22 September and spent over 75 days there, with little information being given out by the hospital and state government, until she succumbed to a cardiac arrest on 5 December.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X