వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత ఆత్మ శాంతించే వరకు శశికళ సీఎం కాలేరంట !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆత్మ శశికళ మీద కోపంగా తిరుగుతోందని, అందుకే చిన్నమ్మకు అన్నీ ప్రతికూల వాతావరణాలే ఎదురౌతున్నాయని ఆ రాష్ట్ర ప్రజలు, అన్నాడీఎంకే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.

<strong>రిసార్ట్ బాత్రూంలో దూరి తప్పించుకున్న ఎమ్మెల్యే: శశికళ వర్గంపై కేసు పెట్టి !</strong>రిసార్ట్ బాత్రూంలో దూరి తప్పించుకున్న ఎమ్మెల్యే: శశికళ వర్గంపై కేసు పెట్టి !

జయలలిత ఆత్మ శాంతిచకపోవడం వలనే ఇలా జరుగుతోందని తమిళనాడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తాను రాజకీయాల్లోకి రానని శశికళ స్వయంగా జయలలితకు అగ్రిమెంట్ రాసిచ్చారని, ఇప్పుడు అమ్మకు ఇచ్చిన మాట శశికళ తప్పుతున్నారని ఇటీవల పన్నీర్ సెల్వం ఆరోపించిన విషయం తెలిసిందే.

Jayalalithaa's morphed image doing hulchul in social media linking to sasikala

తన రాజీనామాను వెనక్కి తీసుకుని తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళ ప్రజలకు సేవ చెయ్యాలని అమ్మ ఆత్మ తనకు చెప్పిందని పన్నీర్ సెల్వం స్వయంగా మీడియా ముందు చెప్పారు. అమ్మ ఆత్మ శాంతించే వరకు ఏదో వింత జరిగితే తప్ప చచ్చినా శశికళ సీఎం కాలేరని అన్నాడీఎంకే పార్టీకి చెందిన కార్యర్తలు అంటున్నారు.

<strong>శశికళ మీద కోపంతో జయలలిత ఆత్మ ఇలా తిరుగుతుందా ?</strong>శశికళ మీద కోపంతో జయలలిత ఆత్మ ఇలా తిరుగుతుందా ?

సరిగ్గా ఒక నెల క్రితం (జనవరి 10వ తేదీ) సోషల్ మీడియాలో అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళ తప్పుకోవాలని, ఆమె మీద జయలలిత ఆత్మ కోపంగా సంచరిస్తోందని ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అప్పట్లో తమిళనాడులో ఈ విషయం సంచలనంరేపింది.

ఇప్పుడు తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాట్లాడుతూ తమిళనాడు ప్రజలకు సేవ చెయ్యడానికి నువ్వే ముఖ్యమంత్రిగా ఉండాలని, అన్నాడీఎంకే పార్టీని కాపాడాలని అమ్మ ఆత్మ తనకు చెప్పిందని, ఇప్పుడు కూడా తాను నోరు విప్పకపోతే అమ్మ ఆత్మ తనను క్షమించదని చెప్పారు. ఇప్పుడు మళ్లీ అమ్మ ఆత్మ గురించి సోషల్ మీడియాతో పాటు తమిళనాడులో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

English summary
Jayalalithaa's morphed image doing hulchul in social media linking to sasikala
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X