వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత మేనకోడలు దీపా కొత్త పార్టీ: పురట్చిమలర్

జయలలిత మేనకోడలు దీపా కార్యకర్తలతో మాట్లాడుతూ ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాల శుభసమయాన ఈనెల 17న తన రాజకీయ ప్రవేశంపై అధికారికంగా ప్రకటన చేస్తానని,

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో వినీలాకాశంలో మరో నేత త్వరలో మెరవనుంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేన కోడలు దీపా జయకుమార్ ఆ రాష్ట్రంలో మరో పార్టీ స్థాపించడానికి రంగం సిద్దం అయిపోయింది.

ఇప్పటికే దీపాకు పురట్చిమలర్ (విప్లవ పుష్పం) అనే నామకరణం కూడా జరిగిపోయింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీ. రామచంద్రన్ (ఎంజీఆర్) శత జయంతి రోజన అధికారికంగా తన రాజకీయ పార్టీ పేరు ప్రకటించనున్నట్లు దీపా తెలిపారు.

నెచ్చెలి శశికళ బహిష్కరణ ! అన్నాడీఎంకే లీడర్స్

దీపా మరో విప్లవం అంటూ అన్నాడీఎంకే కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ పురట్చితలైవర్ (విప్లవ నాయకుడు), దివంగత ముఖ్యమంత్రి జయలలితను పురట్చి తలైవి (విప్లవ నాయకి) అని తమిళనాడు ప్రజలు పిలుచుకుంటారు.

ఇదే కోవలో ఇప్పుడు దీపాకు పురట్చి మలర్ (విప్లవ పుష్పం) అని పిలుచుకోవడం ప్రారంభించారు. దీపా కాబోయే ముఖ్యమంత్రి అంటు నినాదాలు చేస్తున్నారు. దీపా తమిళనాడు సీఎం అనే పేరుతో క్యాలెండర్లు, స్టిక్కర్లు చలామణిలోకి వచ్చేశాయి.

జయలలిత మేనకోడలు దీపాకు జేజేలు, శశికళకు శాపనార్థాలు

ఈ సందర్బంగా దీపా తన ఇంటి దగ్గరకు వచ్చిన కార్యకర్తలతో మాట్లాడుతూ ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాల శుభసమయాన ఈనెల 17న తన రాజకీయ ప్రవేశంపై అధికారికంగా ప్రకటన చేస్తానని దీపా ప్రకటించారు.

అమ్మ (జయలలిత) పేరు, ప్రతిష్టలు నిలబెట్టేలా అందరూ ఆశిస్తున్నట్లే తన నిర్ణయం ఉంటుందని, తనపై అభిమానంతో తరలివచ్చే వారికోసం పని చేస్తానని దీపా చెప్పారు. కచ్చితంగా తాను రాజకీయాల్లోకి వస్తానని దీపా స్పష్టం చేశారు.

Jayalalithaa’s nice Deepa claims MGR legacy, to form new party in TN

రాజకీయాల్లో్కి వస్తా: నన్ను ఏశక్తులు ఆపలేవు: జయ మేనకోడలు దీపా

జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్ ను అన్నాడీఎంకే పార్టీ చీఫ్ గా నియమించడాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ శ్రేణులన్నీ దీపా ఇంటి బాటపడుతున్నాయి. చెన్నైలోని టీ నగర్ లో ఉన్న దీపా ఇంటికి ప్రతి రోజు తండోపతండాలుగా కార్యకర్తలు వస్తున్నారు.

ప్రతిరోజు దీపా రాజకీయ పెద్దలను, తన శ్రేయోభిలాషులను కలుసుకుని అభిప్రాయాలు సేకరిస్తున్నారు. సాయంత్రం దీపా తన ఇంటి దగ్గరకు వస్తున్న కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. దీపా ఇంట్లో లేని సమయంలో ఆమె భర్త మాధవన్ ఇంటి దగ్గరకు వస్తున్న కార్యకర్తలతో మాట్లాడుతున్నారు.

అన్నాడీఎంకేలో అసమ్మతి చిచ్చు: దొరైస్వామి, మాజీ స్పీకర్ దెబ్బ

చెన్నై లోని టీ నగర్ లోని ఆటో స్టాండ్ యూనియన్ సభ్యులు దీపా చిత్రంతో కూడిన స్టిక్కర్లును అంటించుకుని మద్దతు తెలుపుతున్నారు. శశికళను వ్యతిరేకిస్తున్న అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు దీపాకు జై కొడుతున్నారు.

ఫిబ్రవరి 24వ తేదీన తమిళనాడులోని సేలంలో జయలలిత దీపా పేరవై మహానాడు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేరవై రాష్ట కన్వీనర్ జీఆర్. రామచంద్రన్ చెప్పారు. ఇప్పటికే 28 జిల్లాల్లో దీపా పేరవై సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జోరుగా సాగుతోందని అన్నారు. దీపా పేరవై మహానాడులో సభ్యత్వ నమోదు వివరాలను వెల్లడిస్తామని ఆయన వివరించారు.

English summary
Deepa asked the cadre to be calm. The centenary celebrations of AIADMK founder MGR, who worked for the upliftment of the poor, would be celebrated from January 17. On that day, with his blessings, we will function together.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X