వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంపేస్తాం అంటున్నారు: జయలలిత మేనకోడలు, శశికళ, టీటీవీ దినకరన్ దే భాద్యత, కేసు!

|
Google Oneindia TeluguNews

చెన్నై: వీకే. శశికళ నటరాజన్, ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌ల మద్దతుదారుల నుంచి తనకు హత్యా బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు, ఎంజీఆర్‌ అమ్మా దీప పేరవై వ్యవస్థాపకురాలు దీప చెన్నై నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన దీప తనకు రక్షణ కల్పించాలని మనవి చేశారు.

సోషల్ మీడియా !

సోషల్ మీడియా !

వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లో తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని జయలలిత మేనకోడలు దీప మీడియాకు చెప్పారు. ఇప్పటికే చెన్నైలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని దీప విచారం వ్యక్తం చేశారు.

 జయలలిత జయంతి

జయలలిత జయంతి

మా మేనత్త జయలలిత జయంతి వేడుకల నిర్వహణకు తాను ఏర్పాట్లు చేస్తున్నానని, తన ఎంజీఆర్ అమ్మా దీపా పేరవై తరఫున రాష్ట్రవ్యాప్తంగా అయిదు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు ఉంటాయని, ఈ సందర్బంలో కొందరు తనను హత్య చేస్తామని బెదిరిస్తున్నారని దీప ఆరోపించారు.

శశికళ, టీటీవీ దినకరన్

శశికళ, టీటీవీ దినకరన్

తమిళనాడులో తన పర్యటన అడ్డుకోవడానికే శశికళ నటరాజన్, ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌ల మద్దతుదారులు ఇలా చేస్తున్నారని దీప ఆరోపించారు. నెల రోజులుగా తన సెల్‌ఫోన్‌కు కూడా కాల్‌ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని దీప ఆరోపించారు.

Recommended Video

Jayalalithaa 'Eternal General Secretary',Sasikala Removed ఆ పదవి ఎప్పటికీ జయలలితదే | Oneindia Telugu
మొబైల్ లో రికార్డు చేశా

మొబైల్ లో రికార్డు చేశా

బెదిరింపు ఫోన్ కాల్స్ రికార్డు చేశానని, కొన్ని ఆధారాలతో కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు కూడా చేశానని దీప మీడియాకు చెప్పారు. శశికళ నటరాజన్, టీటీవీ దినకరన్‌ల ప్రోద్బలంతో ఇదంతా జరుగుతోందని దీప ఆరోపించారు. ముఖ్యంగా ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై నుంచి తొలగించిన టీటీవీ దినకరన్‌ మద్దతుదారులకు దీంతో సంబంధం ఉందని దీప ఆరోపించారు.

నా భర్తకు సంబంధం !

నా భర్తకు సంబంధం !


తన భర్త మాధవన్‌కు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని, రాజకీయపరంగా తమ మధ్య అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ కలిసే ఉంటున్నామని దీప స్పష్టం చేశారు. ఇదే సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చిన బెదిరింపుల మెసేజ్ లు మీడియాకు చూపించిన దీప తనకు ఎదైనా హాని జరిగితే శశికళ నటరాజన్, టీటీవీ దినకరన్ బాధ్యత వహించాలని అన్నారు.

డ్రైవర్ కు మళ్లీ పదవి

డ్రైవర్ కు మళ్లీ పదవి

ఎంజీఆర్‌ అమ్మా దీప పేరవైలో అక్రమాలకు పాల్పడుతున్నాడని దీప తన కారు డ్రైవర్ ఏవీ. రాజాను ఇటీవల పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే మళ్లీ తన కారు డ్రైవర్ రాజాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దీప నియమించారు. దీప భర్త మాధవన్, కారు డ్రైవర్ రాజాల మధ్య అనేక సార్లు గొడవ జరిగింది. అయితే దీపా మళ్లీ రాజాకు పార్టీలో కీలకపదవి అప్పగించారు.

English summary
Alleging that her life is under threat, former chief minister J Jayalalithaa's niece Deepa Jayakumar on Friday lodged a complaint with the Greater Chennai city police commissioner, against the supporters of expelled AIADMK leaders V K Sasikala and TTV Dhinakaran. A V Raja Joined Deepa peravai. Raja who was working as car driver of former Tamil Nadu chief minister J Jayalalithaa's niece Deepa Jayakumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X