చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలిత ఇంటి కోసం హైకోర్టుకు మేనకోడలు దీపా: ప్రభుత్వానికి నోటీసులు జారీ, వారసులు !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పోయెస్ గార్డెన్ లోని నివాసగృహం వేదనిలయాన్ని స్మారకమండపంగా మార్చే నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె మేనకోడలు దీపా మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పోయెస్ గార్డెన్ లోని నివాసగృహం వేదనిలయాన్ని స్మారకమండపంగా మార్చే నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె మేనకోడలు దీపా మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దీపా పిటిషన్ విచారణకు స్వీకరించిన మద్రాసు హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

జయలలిత మేనకోడలు మోసం చేశారు, ప్రజల సొమ్ము స్వాహా చేసింది, మండిపడిన లాయర్ !జయలలిత మేనకోడలు మోసం చేశారు, ప్రజల సొమ్ము స్వాహా చేసింది, మండిపడిన లాయర్ !

ఈనెల 23వ తేదీ లోగా దీపా పిటిషన్ కు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చెయ్యాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి రవిచంద్రబాబు తమిళనాడు ప్రభుత్వానికి సూచించారు. తమిళనాడు దివింగత ముఖ్యమంత్రి జయలలిత తల్లి సంధ్య సినీరంగంలో ఉన్న సమయంలో అనేక ఆస్తులు సంపాధించారని దీపా పిటిషన్ లో వివరించారు.

 వేదనిలయంలో పుట్టి పెరిగాం

వేదనిలయంలో పుట్టి పెరిగాం

అందులో చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం కూడా ఒక్కటని, అదే ఇంటిలో తాను, తన సోదరుడు దీపాక్ పుట్టి పెద్ద అయ్యేంత వరకు అక్కడే పెరిగామని దీపా వివరించారు. తరువాత ఉన్నత చదువుల కోసం టీ నగర్ లోని మరో ఇంటిలో కాపురం పెట్టామని తెలిపారు.

జయ వీలునామా లేదు

జయ వీలునామా లేదు

మాఅవ్వగారైన సంధ్య, మా నాన్న జయకుమార్ పోయెస్ గార్డెన్ లోనే మరణించారని దీపా పిటిషన్ లో పేర్కొన్నారు.మా మేనత్త జయలలిత కొడనాడు, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో స్థిరాస్తులు సంపాధించారని, ఆ ఆస్తులకు సంబంధించి జయలలిత ఎలాంటి వీలునామా రాయలేదని దీపా గుర్తు చేశారు.

సీఎం పట్టించుకోలేదు

సీఎం పట్టించుకోలేదు

చట్టప్రకారం మా మేనత్త ఆస్తులకు తాను, తన సోదరుడు దీపక్ మాత్రమే వారసులని, వేదనిలయాన్ని స్మారక మండపంగా మార్చరాదని అభ్యతంరం చెబుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాసినా వారు పట్టించుకోలేదని దీపా ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 ప్రభుత్వానికి సూచించండి

ప్రభుత్వానికి సూచించండి

పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో స్మారక మండపం పనులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చెయ్యాలని దీపా మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మా మేనత్త ఎలాంటి వీలునామా రాయకపోవడంతో చట్టప్రకారం ఆమె రక్త సంబంధికులు అయిన మాకే ఆస్తులు చెందే విధంగా ఉత్తర్వులు జారీ చెయ్యాలని దీపా కోర్టులో మనవి చేశారు.

ప్రభుత్వానికి నోటీసులు

ప్రభుత్వానికి నోటీసులు

దీపా పిటిషన్ పూర్తిగా పరిశీలించిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి రవిచంద్రబాబు తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి కౌంటర్ అఫిడవిట్ వెయ్యాలని సూచించారు. జయలలిత ఆస్తులు సొంతం చేసుకోవడానికి దీపా, జయకుమార్ చట్టపరంగా పోరాటం చెయ్యడానికి సిద్దం అయ్యారు.

English summary
The Madras High Court on Monday issued notice to the Tamil Nadu government on a petition challenging the latter's proposal to convert the Poes Garden residence of Jayalalithaa into a memorial. Justice K Ravichandra Baabu sought the government's response by October 23 on the petition filed by J Deepa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X