వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలితకు మళ్లీ అంత్యక్రియలు: ఆత్మశాంతించాలని

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు పవిత్ర నగరం శ్రీరంగపట్టణంలోని కావేరీ నదీ ఒడ్డున మళ్లీ అంత్యక్రియలు నిర్వహించారు.

|
Google Oneindia TeluguNews

మండ్య/బెంగళూరు: తమిళనాడు ప్రజల గుండెల్లో అమ్మగా చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి జయలలితకు పవిత్ర నగరం శ్రీరంగపట్టణంలోని కావేరీ నదీ ఒడ్డున మళ్లీ అంత్యక్రియలు నిర్వహించారు.

మేలుకోటే ప్రధాన అర్చకుడు రంగనాథ్ అయ్యంగార్ జయలలిత రూపానికి ప్రతిరూపంగా ఉండేలా ఒక బొమ్మను తయారు చేయించి ఆ రూపానికి అంత్యక్రియలను శ్రీరంగపట్టణంలోని పశ్చిమ వాహినిలో హిందూ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు చేయించారు.

జయలలితకు సోదరుడి వరస అయ్యే వరదరాజు ఈ అంత్యక్రియలను దగ్గరుండి చేయించారు. మేలుకోటే నివాసం ఉంటున్న జయలలిత మేనల్లుళ్ల కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రాబోయే ఐదు రోజుల పాటు జయలలిత ఆత్మశాంతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందని ప్రధాన అర్చకుడు రంగనాథ్ అయ్యంగార్, జయ సోదరుడు వరదరాజు చెప్పారు.

<strong>జయలలిత ఆత్మ 'ప్రేతాత్మ' అయ్యి తిరుగుతుందంట !</strong>జయలలిత ఆత్మ 'ప్రేతాత్మ' అయ్యి తిరుగుతుందంట !

Jayalalithaa’s relatives re-perfom last rites as Hindu customs for her Moksha near Mandya in Karnataka

ఈ సందర్బంగా వారు చెన్నైలోని మెరినా బీచ్ లో జరిగిన జయలలిత అంత్యక్రియల తీరుపై మండిపడ్డారు. జయలలితకు వరసకు సోదరుడు అయ్యే వరదరాజు మాట్లాడుతూ జయ నమ్మకాలను అన్నాడీఎంకే పార్టీ నాయకులు గౌరవించాల్సిందని ఆయన భావించారు.

తన సోదరి జయలలిత నాస్తికురాలు అయి ఉంటే ఆమె ఆలయాలకు వెళ్లేవారు కాదని, ప్రత్యేక పూజలు చేయించి హిందూ ఉత్సవాల్లో పాల్గొనేవారు కాదని, అసలు హిందూ సాంప్రదాయాలను పాటించేవారు కాదని గుర్తు చేశారు.

జయలలితను ఖననం చెయ్యాలన్న నిర్ణయం అన్నాడీఎంకే పార్టీ ఎలా తీసుకుంటుందని, కనీసం కుటుంబ సభ్యులనైనా సంప్రదించారా ? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. అసలు మా కుటుంబ సభ్యులను అంత్యక్రియలకు ఎందుకు దూరం పెట్టారు ? అని ఆయన అన్నాడీఎంకే నాయకులను ప్రశ్నించారు.

Jayalalithaa’s relatives re-perfom last rites as Hindu customs for her Moksha near Mandya in Karnataka

<strong>జయ దత్త పుత్రుడిపై గంజాయి కేసు: అడుగు పెట్టాడు అంతే</strong>జయ దత్త పుత్రుడిపై గంజాయి కేసు: అడుగు పెట్టాడు అంతే

జయలలిత డిసెంబర్ 5వ తేదిన మరణిస్తే, ఆరో తేదీన అంత్యక్రియలు నిర్వహించడంతోనే మాకు హిందూ సాంప్రధాయాలతో అంత్యక్రియలు నిర్వహించరనే అనుమానం వచ్చిందని వరదరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

జయలలిత చిన్నతనం నుంచి హిందూ సాంప్రదాయాలను గట్టిగా పాటిస్తారని, అందు వలన అయ్యంగార్ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి ఉండాల్సిందని మేలుకోటేలోని జయలలిత బంధువులు అన్నారు.

జయలలిత ఆత్మశాంతించి, ఆమె ఆత్మ ప్రశాంతంగా ఉండాలనే తాము మళ్లీ అంత్యక్రియలు నిర్వహించామని వారు స్పష్టం చేశారు. మొత్తం మీద అన్నాడీఎంకే నాయకుల తీరుపై మేలుకోటేలోని జయలలిత బంధువులు మండిపడుతున్నారు.

English summary
Chief priest Ranganath Iyengar performed the last rites, cremating a doll, meant to be her replica. He said to help Jayalalithaa's soul attain moksha, her body should have been cremated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X