జయలలిత కొడుకుగా చెప్పుకొన్న కృష్ణమూర్తి జైలుకే, కారణమిదే?
చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, తెలుగు సినీ నటుడు శోభన్ బాబుకు పుట్టిన కొడుకుగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన కృష్ణమూర్తి అనే వ్యక్తిని అరెస్టు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.
తప్పుడు ధృవీకరణపత్రాలతో కోర్టు సమయాన్ని వృధా చేశారని మద్రాస్ హైకోర్టు జడ్జి ఆర్ మహదేవన్ అభిప్రాయపడ్డారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, తెలుగు సినీ నటుడు శోభన్ బాబు లకు పుట్టిన కొడుకుగా కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించాడు.

అయితే కృష్ణమూర్తి చూపుతున్న ఆధారాలన్నీ ఫోర్జరీవని పోలీసులు తేల్చారు.దీంతో చట్టపరంగా కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని జడ్జి మహదేవన్ పోలీసులను ఆదేశించారు.జయలలిత, శోభన్ బాబు దంపతులు తనను దత్తత తీసుకొన్నారంటూ ఆయన తప్పుడు ధృవీకరణ పత్రాలను కోర్టుకు సమర్పించారు.
అయితే కృష్ణమూర్తి చూపుతున్న ఆధారాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.దీంతో సోమవారం నాడు సీల్డ్ కవర్ లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైకోర్టుకు నివేదికను ఇచ్చారు.ఈ నివేదిక ఆధారంగా ఈరోడ్ కృష్ణమూర్తిని అరెస్టు చేయాలని మద్రాస్ హైకోర్టు జడ్జి మహదేవన్ పోలీసులను ఆదేశించారు.