వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత స్పృహలో ఉండే వేలిముద్రలు, జస్టిస్, డాక్టర్ ను శశికళ అడ్డుకున్నారు, అమ్మ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని రెండు శాసన సభ నియోజక వర్గాలు, పుదుచ్చేరీలోని ఒక శాసన సభ నియోజక వర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల కోసం దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో జయలలిత స్పృహలో ఉన్న సమయంలోనే వేలిముద్రలు వేశారని తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ వెల్లడించింది. ఆ సమయంలో డాక్టర్ ను శశికళ అడ్డుకున్నారని వెలుగు చూసింది.

అమ్మ ఉన్నప్పుడే

అమ్మ ఉన్నప్పుడే

జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే తమిళనాడులోని రెండు శాసన సభ ఎన్నికలు, పుదుచ్చేరీలోని ఒక శాసన సభ నియోజక వర్గంలో ఉప ఎన్నికలు పూర్తి అయ్యాయని జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ చెప్పింది.

డాక్టర్ బాలాజీ

డాక్టర్ బాలాజీ

రెండాకుల చిహ్నం కేటాయింపునకు సంబంధించిన అన్నాడీఎంకే పార్టీ బీ ఫారంల్లో జయలలిత వేలిముద్రలు ఉన్నాయి. వేలిముద్రలు తీసుకున్న సమయంలో జయలలిత స్పృహలోనే ఉన్నారని తమిళనాడు ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ బాలాజీ జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చారు.

శశికళ అడ్డుకున్నారు

శశికళ అడ్డుకున్నారు

డాక్టర్ బాలాజీ వాంగ్మూలం వాస్తవమేనని జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్‌ నిర్ధారించింది. అపోలో ఆసుపత్రి గదిలో జయలలిత వేలిముద్రలు తీసుకున్నది నిజమేనని, తరువాత ఆమె వేలికి అంటుకున్న సిరాను డాక్టర్ బాలాజీ తుడిచేందుకు ప్రయత్నించారని, ఆ సమయంలో ఆయన్ని అడ్డుకున్న వీకే శశికళ నటరాజన్ అమ్మ చేతి వేలికి అంటుకున్న సిరాను తుడిచివేశారని జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ వెల్లడించింది.

ఆరునెలలు పొడగింపు

ఆరునెలలు పొడగింపు

జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ జరిపించడానికి తమిళనాడు ప్రభుత్వం మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ను ఆరు నెలలు పొడగిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

పూర్తి విచారణ జరగాలి!

పూర్తి విచారణ జరగాలి!

జయలలిత అనుమానాస్పద మృతిపై పూర్తి విచారణ జరిపించడానికి, వాస్తవాలు బయటకులాగడానికి అవకాశం ఇవ్వాలనే విచారణ కమిషన్ గడుపు పొడగించామని ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం అంటోంది. జయలలిత అనుమానాస్పద మృతిపై ఇంకా కొందరిని విచారణ చెయ్యాలని జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ నిర్ణయించింది.

English summary
Tamil Nadu government announces that Enquiry commission under Retired Judge Arumugasamy appointed to probe Jayalalithaa's death. Now 6-month extension for Inquiry commission in Jayalalitha death. In the commission, DR. Balaji says no one has given the proper letter to get Jayalalithaa's fingerprint. Jayalalithaa's thump impression got by Sasikala when Jaya was conscious confirms, Inquiry commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X