చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలిత మృతి, హై కోర్టులో పిల్: వివరాలు ఇవ్వండి !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అపోలో ఆసుపత్రిలో అందించిన చికిత్స వివరాలు వెల్లడించాలని మనవి చేస్తూ సామాజిక సేవకుడు (ఆర్ టీఐ కార్యకర్త) ట్రాఫిక్ రామస్వామి మద్రాసు హై కోర్టులు ప్రజాహితవాజ్యం దాఖలు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అపోలో ఆసుపత్రిలో అందించిన చికిత్స వివరాలు వెల్లడించాలని మనవి చేస్తూ సామాజిక సేవకుడు (ఆర్ టీఐ కార్యకర్త) ట్రాఫిక్ రామస్వామి మద్రాసు హై కోర్టులు ప్రజాహితవాజ్యం దాఖలు చేశారు.

సెప్టెంబర్ 22వ తేదిన జయలలిత ఆపోలో ఆసుపత్రిలో చేరారని, తరువాత అపోలో ఆసుపత్రి వైద్యులు, లండన్, సింగపూర్, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు జయలలితకు చికిత్స అందించారని కోర్టుకు వివరించారు.

 Jayalalithaa: Traffic Ramaswamy filed a petition In Madras High Court

అంతర్జాతీయ నిపుణులు జయలలితకు ఎలాంటి చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతం అమ్మ కోలుకుంటున్నారని అపోలో ఆసుపత్రి ప్రకటనలు జారీ చేసిన కొన్ని రోజులకే జయలలిత మరణించారని, జయ మృతిపై ప్రజల్లో అనుమానం కలుగుతోందని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.

జయలలితకు అపోలో ఆసుపత్రిలో 75 రోజుల పాటు ఏయే చికిత్సలు చేశారు అనే విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ట్రాఫిక్ రామస్వామి తన పిటీషన్ లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్ విచారణకు స్వీకరించాలా ? వద్దా ? అనే విషయంపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మద్రాసు హైకోర్టు రిజిస్టార్ జనరల్ కార్యాలయం తెలిపింది. 2017 జనవరి 9వ తేదీన ఏ విషయం చెబుతామని స్పష్టం చేశారు.

English summary
Traffic Ramaswamy filed a petition In Madras High Court against to set up a monument where Chief Minister Jayalalitha's body were buried. The trial has been postponed to January 9th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X