వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత సెక్రటరీ విచారణ, ఆరోజు పోయెస్ గార్డెన్ లో ఏం జరిగిందంటే: క్లారిటీ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ విచారణ ముమ్మరం చేశారు. ఆర్ముగస్వామి విచారణ కమిషన్ తీరికలేకుండా పలువురికి సమన్లు జారీచేసి విచారణ చేస్తోంది. తాజాగా మూడో సారి జయలలిత పర్సనల్ సెక్రటరీ పొన్ గుండ్రన్ ని మంగళవారం విచారణ చేసి పోయెస్ గార్డెన్ లో ఆ రోజు ఏం జరిగింది అనే వివరాలు సేకరించారు.

పోయెస్ గార్డెన్

పోయెస్ గార్డెన్

జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో ఆమె పర్సనల్ సెక్రటరీగా పొన్ గుండ్రన్ పని చేశారు. పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం వ్యవహారాలు మొత్తం పొన్ గుండ్రన్ కు తెలుసు. అక్కడి వ్యవహారాలు పొన్ గుండ్రన్ కు తెలియకుండా జరగవని సమాచారం.

అమ్మకు క్లోజ్

అమ్మకు క్లోజ్

జయలలితకు పర్సనల్ సెక్రటరీగానే కాకుండా అమ్మకు పొన్ గుండ్రన్ చాల సన్నిహితుడని సమాచారం. జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ చేస్తున్న రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ పొన్ గుండ్రన్ కు మరోసారి సమన్లు జారీ చేసింది.

పొన్ గుండ్రన్ క్లారిటీ

పొన్ గుండ్రన్ క్లారిటీ

మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు మంగళవారం హాజరైన పొన్ గుండ్రన్ వివరణ ఇచ్చారు. 2016 సెప్టెంబర్ 22వ తేదీన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో ఏం జరిగింది ? అనే పూర్తి సమాచారం పొన్ గుండ్రన్ వివరించారని తెలిసింది.

ఎవరెవరు ఉన్నారు ?

ఎవరెవరు ఉన్నారు ?

2016 సెప్టెంబర్ 22వ తేదీన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో అమ్మ జయలలితతో పాటు ఎవరెవరు ఉన్నారు? శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఎవరెవరు అక్కడికి వచ్చారు అనే పూర్తి సమాచారం ఆర్ముగస్వామి విచారణ కమిషన్ సేకరించిందని తెలిసింది.

షీలా బాలక్రిష్ణన్

షీలా బాలక్రిష్ణన్

జయలలితకు చాల సన్నిహితంగా ఉన్న తమిళనాడు ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ షీలా బాలక్రిష్ణన్ కు జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ మరోసారి సమన్లు జారీ చేసింది. గురువారం (జనవరి 11)వ తేదీ విచారణకు హాజరు కావాలని షీలా బాలక్రిష్ణన్ కు ఆర్ముగస్వామి విచారణ కమిషన్ సూచించింది.

English summary
Jayalalitha's personal secretary Poongundran appeared before justice Arumugasamy commission, because he knows everything in Veda Nilayam and close to Jayalalitha's day to day activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X