వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రయాణికురాలి కోసం కేంద్ర మంత్రి సీటు త్యాగం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అనారోగ్యంతో ఉన్న ఒక ప్రయాణికురాలి పట్ల కేంద్ర విమానయాన శాఖా సహాయ మంత్రి జయంత్ సిన్హా తన హోదాను పక్కన పెట్టి విమానంలో వీఐపీ సీటు త్యాగం చేశారు. భార్యతో కలిసి సామాన్య ప్రయాణికుడిలా ఎకనామీ క్లాస్ లో బెంగళూరు నుంచి రాంచీకి ప్రయాణించారు.

అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కుమార్తె శ్రేయా ప్రదీప్ మంచి రోజులు (అచ్చేదిన్) అంటే ఇవే అంటూ ట్విట్టర్ లో కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు చెప్పడంతో జయంత్ సిన్హాను అందరూ ప్రశంసలతో అభినందిస్తున్నారు.

బెంగళూరు నుంచి రాంచీ వెలుతున్నఇండిగో విమానంలో శ్రేయా ప్రదీప్‌ తన తల్లితో కలిసి ప్రయాణిస్తోంది. అయితే శ్రేయా ప్రదీప్ తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఆమె కాళ్లు చాపుకుని పడుకోవడానికి చాల ఇబ్బంది పడ్డారు.

శ్రేయా ప్రదీప్, ఆమె తల్లి ప్రయాణించేది ఎకానమీ క్లాస్‌లో కావడంతో ఇబ్బంది ఎదురైయ్యింది. అదే ఇండిగో విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖా సహాయమంత్రి జయంత్ సిన్హా తన భార్యతో కలిసి వీఐపీ సీట్లలో ప్రయాణిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న జయంత్ సిన్హా తమ రెండు సీట్లను తల్లీ కూతుళ్లకు ఇచ్చేశారు. తరువాత ఆయన తన భార్యతో సహా ఎకానమీ క్లాస్‌లోకి వెళ్లారు. దాంతో శ్రేయా ప్రదీప్ తల్లికి కాస్త ఊరట లభించినట్లు అయ్యింది.

ఈ విషయాన్ని శ్రేయా ప్రదీప్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ పోస్టును 4,000 మంది రీట్వీట్ చేయగా, అందులో3,900 మంది లైక్ చేశారు. మంత్రి జయంత్‌ సిన్హాతో కలిసి ఒక సెల్ఫీ తీసుకుని ఆ ఫొటోను కూడా ఆమె ట్వీట్ చేసింది.

అప్పటినుంచి పలువురు శ్రేయా ప్రదీప్ ను, కేంద్ర సహాయ మంత్రి జయంత్ సిన్హాను, కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. విషయం తెలియగానే స్పందించి, సమస్యలను పరిష్కరించడంలో ముందున్నందుకు జయంత్ సిన్హా అభినందిస్తున్నారు.

English summary
Jayant Sinha and his wife insisted that the girl and her mother continue to occupy the premium seats and they themselves sat in normal economy seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X