వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపిస్టులకు ఉరే సరి: తరుణ్ తేజ్‌పాల్‌పై జయప్రద

By Pratap
|
Google Oneindia TeluguNews

పానాజీ: తెహెల్కా వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్ సంఘటనపై సినీనటి, పార్లమెంటు సభ్యురాలు జయప్రద తీవ్రంగా ప్రతిస్పందించారు. అత్యాచారానికి పాల్పడినవారిని ఉరి తీయాలని ఆమె వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులు తరుణ్ తేజ్‌పాల్‌పై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలపై ఆమెను ప్రశ్నించారు. దానికి ప్రతిస్పందనగా ఆమె ఆ విధంగా అన్నారు.

ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే వారికి ఉరిశిక్షే సరైందని, అలా కానిపక్షంలో కనీసం జీవిత ఖైదు విధించాలని జయప్రద అన్నారు. ఓ సినిమా నిర్మాణం పనుల్లో ఆమె గోవాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఓ వార్తాసంస్థ ప్రతినిధితో మాట్లాడారు.

Jayaprada

ఉత్తరప్రదేశ్‌లో నేరాలు పెరుగుతున్నాయని, ఈ స్థితిలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ప్రజలకు భరోసా కల్పించాలని ఆమె అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో నేరాలు పెరుగుతుండడంతో మహిళలు, పిల్లలు భయబ్రాంతులకు గురవుతున్నారని ఆమె అన్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు పెరుగుతన్న నేరాలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే మహిళలకు భద్రత కరువైందని తాను అనడం లేదని, ముంబై, కోల్‌కతా వాంటి నగరాల్లో కూడా మహిళలకు భద్రత లేదని ఆమె అన్నారు.

English summary
Reacting on Tehelka founder editor Tarun Tejpal sexual assault case, MP and actress Jayaprada opined that culprits in rape cases should be hanged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X