హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిశ ఘటనపై స్పందించిన జయప్రద ... చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హితవు

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ తో నేటికీ దేశంలో చర్చ జరుగుతుంది . నిన్నటి వరకు రోడ్ల పైకి వెళ్లే మహిళలకు భద్రత లేదని భావించిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్య, నిందితులను ఎన్కౌంటర్ చేయడం తెలంగాణ ప్రజలకు ఒక భరోసా ఇచ్చింది. కానీ ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయ్యింది. సుమోటోగా కేసు తీసుకుని విచారణ జరుపుతుంది.

Disha case encounter : దిశ ఘటన ఆ సినిమాలో .. ఈ నిర్ణయం తీసుకుంది ఎవరో తెలుసా !Disha case encounter : దిశ ఘటన ఆ సినిమాలో .. ఈ నిర్ణయం తీసుకుంది ఎవరో తెలుసా !

ఇక నేటికీ పలువురు తమ అభిప్రాయాలను ఎన్ కౌంటర్ విషయంలో వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక ఈ ఘటనపై తాజాగా జయప్రద స్పందించారు .దిశ హత్యోదంతంపై సినీ నటి, రాజకీయవేత్త జయప్రద తన అభిప్రాయం వ్యక్తం చేశారు. షాద్ నగర్ ఘటనపై ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీనిపై మాట్లాడిన జయప్రద ఆడబిడ్డలపై అత్యాచారాలు చేసేవాళ్లకు మరణశిక్షే సరైనదని పేర్కొన్నారు. అయితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా శిక్ష వేయాలని సూచించారు.

Jayaprada responding about disha incident .. suggested not to take law into our hands

ఘటన జరిగిన వెంటనే శిక్షలు అమలు చేయడం ద్వారా ఆ ప్రభావం తప్పకుండా ఉంటుందని జయప్రద అభిప్రాయపడ్డారు. వెంటనే శిక్షలు పడితే నేరప్రవృత్తి ఉన్నవారిలో భయం కలుగుతుందని ఆమె అన్నారు.ఇలాంటి అత్యాచారాలకు అడ్డుకట్ట పడాలంటే ఉరిశిక్షలే మార్గమని పేర్కొన్నారు. చట్టాలను చేతుల్లోకి తీసుకోవటం సమాజానికి మంచిది కాదని ఆమె అన్నారు . నేరస్తులకు శిక్ష పడాలి కానీ అది కోర్టుల ద్వారానే జరగాలంటూ ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేశారు .

English summary
Police have killed four human beasts who were involved in the rape and murder of Disha. Jayapradha responded to the latest incident .Jayaprada expressed his views on the murder of Disha. She expressed deep regret over the Shadnagar incident. Speaking on this, Jayadasa said that the death penalty is right for the rapists. However, it is suggested that fast track courts should be punished without taking the law into their own hands
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X