వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: బొపన్నకు వ్యతిరేకంగా జెడి(ఎస్) సుప్రీంలో పిటిషన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బిజెపి ఎమ్మెల్యే బోపయ్యను ప్రోటెం స్పీకర్ గా నియమించడాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టులో జెడి(ఎస్) శుక్రవారం సాయంత్రం పిటిషన్ దాఖలు చేసింది. నిబంధనలకు విరుద్దంగా ప్రోటెం స్పీకర్ గా నియమించారని కాంగ్రెస్, జెడి(ఎస్) ఆరోపిస్తున్నాయి.

ప్రొటెం స్పీకర్ గా బొపయ్యను నియమిస్తూ శుక్రవారం నాడు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే దేశ్ ‌పాండే మాత్రమే సీనియర్. ఈ తరుణంలో బిజెపికి చెందిన బోపయ్య నియామకాన్ని నిరసిస్తూ జెడిఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

కర్ణాటక సీఎం యడ్యూరప్ప బలపరీక్షను మే 19వ తేది సాయంత్రం ప్రొటెం స్పీకర్ బొపన్న నిర్వహించాల్సి ఉంది. ఈ తరుణంలో బొపన్నను ప్రొటెం స్పీకర్ గా నియమించడంపై కాంగ్రెస్, జెడి(ఎస్) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. గతంలో యడ్యూరప్ప సీఎంగా ఉన్న కాలంలో స్పీకర్ గా బొపన్న పనిచేశారు.

JD(S) files petition in supreme court against Bopanna

అయితే యడ్యూరప్పకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురేసిన 12 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటేశారు బోపన్న. అయితే ఆ వ్యవహరం ఆప్పట్లో కలకలం రేపింది. ఆ సమయంలో బొప్పన్న వ్యవహరం యడ్యూరప్ప సీఎం పదవిని కాపాడింది.

అయితే బొప్పన్నను ప్రోటెం స్పీకర్ గా నియమించడం వెనుక కూడ ఇదే రకమైన మతలబు ఉందని కాంగ్రెస్ కూటమి ఆరోపిస్తోంది. దీంతో బిజెపికి చెక్ పెట్టేందుకు బొపన్న నియామకాన్ని సవాల్ చేస్తూ జెడి(ఎస్) సుప్రీంను ఆశ్రయించింది.

English summary
JD(s) filed petition in supreme court against bopanna to appoint as pro tem speaker. Jjd(s) and congress not satisfied over governor decision on pro tem speaker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X