వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యడ్యూరప్ప సీఎం: కర్ణాటక మొత్తం జేడీఎస్ ధర్నా, 116 మంది ఎమ్మెల్యేలు, గవర్నర్ వన్ సైడ్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక గవర్నర్ వాజుబాయ్ వాలా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జేడీఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. బీఎస్. యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చే'సిన సమయంలో జేడీఎస్ కార్యకర్తలు బెంగళూరు నగరంతో సహ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ధర్నాలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ వాజుబాయ్ వాలా వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారని జేడీఎస్ మండిపడింది.

Recommended Video

కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప
గవర్నర్ ఆహ్వానం లేదు

గవర్నర్ ఆహ్వానం లేదు

కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి కర్ణాటక గవర్నర్ వాజుబాయ్ వాలా అహ్వానించలేదని, బీజేపీకి అవకాశం ఇచ్చారని జేడీఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. బీఎస్. యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చెయ్యడాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జేడీఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

రగులుతున్న మండ్య

రగులుతున్న మండ్య

మండ్య జిల్లాలోని 7 శాసన సభ నియోజక వర్గాల్లో జేడీఎస్ పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. మండ్య జిల్లాలోని వేలాధి మంది నాయకులు, కార్యకర్తలు ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ వాజుబాయ్ వాలాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

116 మంది ఎమ్మెల్యేలు

116 మంది ఎమ్మెల్యేలు


మెజారిటీ లేని బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఎందుకు అవకాశం ఇచ్చారని జేడీఎస్ నాయకులు గవర్నర్ వాజుబాయ్ వాలాను ప్రశ్నించారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు 116 మంది శాసన సభ్యులు ఉన్నారని, మాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని జేడీఎస్ నాయకులు నిలదీస్తున్నారు.

రాజ్ భవన్ ముట్టడి

రాజ్ భవన్ ముట్టడి

జేడీఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో 16 వేల మంది పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బీఎస్. యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చెయ్యకూడదని కాంగ్రెస్, జేడీఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.

English summary
Karnataka Election Results 2018 Updates. B.S.Yeddyurappa to take oath as the Chief Minister of Karnataka on May 17, 2018. JD(S) plan for a protest in all districts of Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X