వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రియల్టర్ కిడ్నాప్‌: మహిళా నేత పక్కా ప్లాన్, రూ. 60 లక్షలు తీసుకుని...

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఎన్నికల్లో పోటీ చేయడానికి ఓ రియల్టర్‌ను కిడ్నాప్ చేసి, 60 లక్షల రూపాయలు తీసుకుని విడిచిపెట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా రాజకీయ నాయకురాలితో పాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

జెడిఎస్ మహిళా విభాగం రాష్ట్రాధ్యక్షురాలు అర్షియా అలీ ఈ కేసులో పట్టుపడింది. రానున్న ఎన్నికల్లో పోట చేయడానికి డబ్బు అవసరమని ఆమె రియల్టర్ కిడ్నాప్‌నకు పథకం వేసినట్లు పోలీసు విచారణలో తేలింది.

అతను వాకింగ్‌కు బయలుదేరగా...

అతను వాకింగ్‌కు బయలుదేరగా...

యలహంక సమీపంలోని మారుతీ నగరలో నివాసం ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి మల్లికార్జున ఈ నెల 11వ తేదీ ఉదయం జికెవికెలో వాకింగ్ కోస కారులో బయలుదేరాడు. కోగిల్ క్రాస్‌లో హెచ్‌బిఆ్ లేఔట్‌కు చెందిన కాంతరాజ్ గౌడ (30), ప్రసాద్ (41), అర్షియా అలీ (32), డ్రైవర్ ప్రదీప్ (27) మల్లికార్జున కారు అడ్డగించి మారణాయుధాలతో బెదిరించి తీసుకుని వెళ్లారు.

ఆయన్ను బంధించారు...

ఆయన్ను బంధించారు...

మల్లికార్జునను హెణ్ణూరు పోలీసు స్టేషన్ పరిధిలోని హొరమావులోని ఓ గ్యారేజీలో బంధించి, మల్లికార్జునప్ప కుమారుడు డాక్టర్ రవికుమార్‌కు ఫోన్ చేశారు. మీ తండ్రిని కిడ్నాప్ చేశామని, రూ. 100 కోట్లు ఇవ్వాలని, పోలీసులకు ఈ విషయం చెప్తే తీవ్ర పరిణామాలుంటాయని కిడ్నాపర్లు హెచ్చరించారు.

హైదరాబాద్ వెళ్లిన రవికుమార్...

హైదరాబాద్ వెళ్లిన రవికుమార్...

సొంత పనిపై హైదరాబాబద్ వెళ్లిన రవికుమార్ తన తండ్రికి ఏ విధమైన హానీ తలపెట్టవద్దని, నగదు తెస్తానని వారికి హామీ ఇచ్చారు. తన స్నేహితుల వద్ద రూ. 60 లక్షల నగదు సమకూర్చుకుని బాగేపల్లి సమీపంలోని ప్రధాన రహదారిలో ఉనన దేవస్థానంోల రాత్రి సమయంలో నగదు ఉన్న బ్యాగ్ పెట్టి కొంత దూరంలో ఉన్న తన తండ్రిని తీసుకుని ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత యలహంక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

24 గంటల్లో అరెస్టు...

24 గంటల్లో అరెస్టు...

డిసిపి గిరీశ్ నాయకత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి ిగి కిడ్నాప్ చేసిన స్థలంలోని సిసి కెమెరాలను పరిశీలించారు. వారు వాడిన మొబైల్ నెంబర్, టవర్ ఆధారంగా హొరమవి ప్రాంతాన్ని చూపించడంతో అక్కడ ఉన్న కారు డ్రైవర్ ప్రదీప్‌ను అదుపులోకి తీసుకు్నారు. ప్రదీప్ ఇచ్చిన సమాచారంతో అర్షియా అలీ సహా మరో ముగ్గురిని అరెస్టు చేశారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించారు.వారినుచి రూ. 1.04 కోట్ల నగదు, 3 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు, ఓ పిస్టల్,తూటాలు, రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
A woman political leader Arsiya Ali and other three arrested in Kidnap case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X