వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తాగి, బార్ గర్ల్స్‌తో అసభ్యంగా చిందేసిన ఎమ్మెల్యే
పాట్నా: బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే బార్‌లో పీకల దాకా తాగి, బార్ గర్ల్స్‌తో చిందేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. అతను ఓ ఫంక్షన్‌కు వెళ్లి, అక్కడ డ్యాన్స్ చేశాడు.

బన్హారియా ఎమ్మెల్యే శ్యాంబహదూర్ సింగ్ ఇటీవల ఓ ఫంక్షన్‌కు వెళ్లాడు. ఫంక్షన్‌లో డ్యాన్స్ చేస్తున్న ఇద్దరు బార్ గర్ల్స్‌తో జత కలిశాడు. వారితో అసహ్యంగా స్టెప్పులేసి అందరినీ షాక్‌కు గురి చేశాడు. దీంతో ఆయన పైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
దీనిపై పార్టీలో ఉన్న కొందరు మాట్లాడుతూ... ఆ సమయంలో సదరు ఎమ్మెల్యే బాగా తాగి ఉన్నాడని చెప్పారు. ముఖ్యమంత్రి నితీష్ ఆయన పైన చర్యలు తీసుకుంటారని చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే, రాష్ట్రాన్ని మద్యపాన రహిత రాష్ట్రంగా ప్రకటించిన విషయం తెలిసిందే.