వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్‌లో బీజేపీ-జేడీయు మధ్య సీట్ల చిచ్చు, 20-20 ఫార్ములాపై అసహనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

పాట్నా: వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్డీయే పక్షాలైన బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల పంపకాలపై చాలా రోజులుగా చర్చలు సాగుతున్నాయి. బీహార్‌లో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. 20 -20 ఫార్ములాతో బీజేపీ జేడీయు ముందు ప్రతిపాదన పెట్టింది. దీని పట్ల జేడీయూ అసంతృప్తితో ఉంది.

సమాచారం మేరకు బీజేపీ ఇరవై సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. మిగతా ఇరవై స్థానాల్లో 12 జేడీయూ, 6 రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీ, రెండు ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని ఆర్ఎస్ఎల్పీకి ఇస్తామని ప్రతిపాదన చేస్తోంది. బీజేపీకి 20, ఇతర పార్టీలకు ఇరవై అని చెబుతోంది.

JD(U) not happy with BJPs 20-20 seat formula

దీనిపై జేడీయూ అసంతృప్తితో ఉంది. ఆ సీట్ల పంపిణీ తమకు ఆమోదం కాదని, లెక్క తేల్చాలని డిమాండ్ చేస్తోంది. బీజేపీ చేస్తోన్న ప్రతిపాదన తమకు గౌరవప్రదంగా లేదని అంటున్నారు. బీజేపీకి 17, తమకు 17 ఉండాలని, మిగిలిన ఆరు లోక్‌జన్‌శక్తి పార్టీకి ఇవ్వాలని జేడీయు ప్రతిపాదిస్తోంది. ఉపేంద్ర కుష్వాహా ఎన్డీయేలో ఉండదల్చుకోలేదని సంకేతాలు ఇస్తున్నారని, కాబట్టి ఆయనకు సీట్లు అవసరం లేదని చెబుతున్నారు.

మరోవైపు సీట్ల వాటా ఖరారు కాలేదని బీజేపీ నేత భూపేంద్ర యాదవ్‌ అన్నారు. 2014లో ఎన్డీయే 31 స్థానాల్లో గెలవగా బీజేపీ 22 స్థానాలు గెలిచిందని, ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన జేడీయూ కేవలం రెండు స్థానాల్లోనే గెలిచిందని, మళ్లీ ఎన్డీయేలోకి వచ్చిన జేడీయూ తమకు గౌరవప్రద సంఖ్యలో సీట్లు కేటాయించాలని కోరుతోందని అంటున్నారు.

English summary
The tussle among NDA constituents for a larger share of seats for the upcoming Lok Sabha polls is getting fierce with reports on Thursday suggesting that the BJP has come up with an initial draft of ‘20-20 formula’ for it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X