• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకం .. బాంబు పేల్చిన జేడీయూ ...

|

పాట్నా : బీజేపీ, జేడీయూ మధ్య క్రమ క్రమంగా దూరంగా పెరుగుతున్నట్టే అనిపిస్తోంది. ప్రస్తుతం ఆ రెండు పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న పరిస్థితి ఉంది. కేంద్ర మంత్రివర్గంలో సీట్లపై మొదలైన అంతర్గత పోరు కొనసాగుతున్నది. ఆ వెంటనే బీహర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టి .. బీజేపీకి పదవులు ఇవ్వకపోయిన సంగతి తెలిసిందే. జేడీయూను తన వైపు తిప్పుకునేందుకు డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇస్తామని చెప్పినా .. నితీశ్ ఆలక వీడినట్టు లేదు.

నీరుగార్చింది ..
ట్రిపుల్ తలాక్ చట్టం .. చట్టబద్ధత కోసం ఎన్డీఏ సర్కార్ విశేషంగా కృషిచేస్తోంది. అయితే ఇదివరకు ఆ బిల్లు లోక్‌సభలో గట్టెక్కినా .. రాజ్యసభలో వీగిపోయినా సంగతి తెలిసిందే. దీంతో తమ కూటమి పక్షాలను కలుపుకొని వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. అయితే జేడీయూ రూపంలో మిత్రపక్షం దూరమైన సిచుయేషన్ ఉంది. ట్రిపుల్ తలాక్ బిల్లుకు తాము మద్దతు తెలుపబోమని జేడీయూ ప్రకటించడం చర్చకు దారితీసింది. ఎన్డీఏ ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు ప్రస్తుత పరిస్థితుల్లో సపోర్ట్ చేయబోమని తేల్చిచెప్పింది. ఈ బిల్లుపై సభలో చర్చ జరిగితే తమ 16 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటేస్తారని తేల్చిచెప్పి .. బీజేపీకి షాకిచ్చింది.

  ఎమ్మెల్యే రాజాసింగ్ అతని అనుచరుల పై దాడి పై స్పందించిన డీసీపీ

  JD (U) not with ally BJP on Triple Talaq, will oppose it in present form

  చర్చించారా ...
  ట్రిపుల్ తలాక్ బిల్లు అనేది సున్నితమైన అంశం. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయాలి. అన్నివర్గాల అభిప్రాయం తీసుకొని .. బిల్లు ప్రవేశపెట్టాలి .. కానీ ఆదర బాదరగా పెట్టడంలో ఆంతర్యం ఏంటని జేడీయూ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి ప్రశ్నించారు. ఈ బిల్లుపై తమ పార్టీ అధ్యక్షుడు లా కమిషన్ ఆఫ్ ఇండియాకు తమ అభ్యంతరాలను ఇదివరకే లేఖ రాశారని పేర్కొన్నారు. అంతేకాదు ట్రిపుల్ తలాక్ బిల్లు గురించి భాగస్వామ్య పక్షాలతో బీజేపీ ఎప్పుడూ చర్చించలేదని ఆరోపించారు. వాస్తవానికి బిల్లు మరోసారి లోక్ సభలో ఆమోదం పొందుతుంది .. కావచ్చు కానీ తమకు రాజ్యసభలో కూడా సభ్యులు ఉన్నారని గుర్తుచేశారు. ఆరుగురు ఎంపీలు ఉన్నారని .. తాము మద్దతివ్వకుంటే బిల్లు పాసవుతుందా అని ప్రశ్నించారు. వాస్తవానికి ఏదైనా బిల్లు రాజ్యసభలో పాసవాలంటే 123 సభ్యుల మద్దతు అవసరం. బీజేపకి ప్రస్తుతం 109 మంది సభ్యుల బలం ఉంది. ఇటీవల బీజేపీలో చేరిన సభ్యులతో .. ఆ సంఖ్య 109కి చేరింది. ఈ క్రమంలో రాజ్యసభలో బిల్లు పాసవ్వాలంటే జేడీయూ మద్దతు తప్పనిసరి.

  English summary
  Chief minister Nitish Kumar-led Janata Dal (United) distanced itself from the BJP-piloted Triple Talaq Bill in Lok Sabha saying “we are opposed to the bill in the present form”. However, the NDA constituent has not made it clear if its 16 MPs will vote against the bill in the lower house. Reiterating party’s stand on the bill, the day it was tabled in the Lok Sabha, JD (U) secretary general KC Tyagi said “we will not support the present bill. It is a delicate matter and efforts should be made to solicit the opinion of all concerned for arriving at a consensus.” Tyagi said JD (U) president has already written to the Law Commission of India explaining his party’s viewpoint.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X