వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నటి రమ్యాకు సినిమా చూపిస్తున్న జేడీఎస్, రెబల్ స్టార్ రెబల్ అయితే, లోకల్ నాన్ లోకల్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్, నటి రమ్యా మండ్య నుంచి పోటీ చెయ్యడానికి సిద్దం అవుతున్నారని తెలిసింది. రమ్యాను ఓడించి సినిమా చూపించడానికి మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక జేడీఎస్ శాఖ అధ్యక్షుడు హెచ్.డీ. కుమారస్వామి మాస్లర్ ప్లాన్ వేస్తున్నారని వెలుగు చూసింది. ఇక రెబల్ స్టార్ అంబరీష్ రెబల్ అయినా, లోకల్ నాన్ లోకల్ విషయంలో తేడా వచ్చినా రమ్యా పరిస్థితి ఎలా ఉంటుందో అని అప్పుడే చర్చ మొదలైయ్యింది.

రమ్యా మైనస్ పాయింట్

రమ్యా మైనస్ పాయింట్

కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి నటి రమ్యా ఒక్క సారి గెలుపోందారు. అయితే ఎంపీగా గెలిచిన నటి రమ్యా ఎక్కువగా బెంగళూరు, ఢిల్లీలోనే ఉన్నారు. మండ్య ప్రజలు సమస్యలు పట్టించుకోలేదని స్థానికులు తీవ్రస్థాయిలో రమ్యా మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

2014లో రమ్యా ఇంటికి

2014లో రమ్యా ఇంటికి

2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నటి రమ్యాను స్థానికులు ఓడించి ఇంటికి పంపించారు. తన ఓటమికి కర్ణాటక మాజీ మంత్రి, మండ్య ఎమ్మెల్యే, స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ కూడా ఓ కారణం అయ్యారని నటి రమ్యా ఆయన మీద పరోక్షంగా ద్వేషం పెంచుకున్నారు.

రమ్యాకు పోటీగా విద్యావంతురాలు

రమ్యాకు పోటీగా విద్యావంతురాలు

ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిగా ఇటీవల వరకూ ఉద్యోగం చేసిన అశ్విన్ గౌడ తన పదవికి రాజీనామా చేశారు. రమ్యాకు పోటీగా సిన్సియర్ మహిళా అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న అశ్విన్ గౌడను రంగంలోకి దింపాలని మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి నిర్ణయించారని జేడీఎస్ వర్గాలు అంటున్నాయి.

లోకల్ నాన్ లోకల్

లోకల్ నాన్ లోకల్

రమ్యాను గెలిపించినా ఫలితం ఉండదని మండ్య ప్రజలు అంటున్నారు. పైగా స్థానిక శాసన సభ్యుడు రెబల్ స్టార్ అంబరీష్ కు టిక్కెట్ దక్కకుండా నటి రమ్యా ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో మండ్య జిల్లా కేఆర్ పేటకు చెందిన అశ్విన్ గౌడను రంగంలోకి దింపితే రమ్యాను కచ్చితంగా ఓడించడానికి అవకాశం ఉంటుందని మాజీ సీఎం కుమారస్వామి నిర్ణయించారని తెలిసింది.

రెబల్ స్టార్ రెబల్ అయితే ?

రెబల్ స్టార్ రెబల్ అయితే ?

స్థానిక శాసన సభ్యుడు అంబరీష్ కు కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వకపోతే ఆయన్ను బీజేపీ నుంచి పోటీ చేయించాలని మాజీ సీఎం ఎస్ఎమ్ కృష్ణ నిర్ణయించారని తెలిసింది. ఏటు చూసినా నటి రమ్యకు నాన్ లోకల్, రెబల్ స్టార్, సిన్సియర్ అధికారి అని పేరు తెచ్చుకున్న అశ్విన్ గౌడ గట్టి పోటీ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

English summary
Some of the report says, JDS is planning to filed women candidate in Mandya assembly consituency. If AICC Social Media Head Ramya contesting in Mandya, JDS decided field former IRS officer Ashwin Gowda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X